Telugu Global
Sports

ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న నబీ

ఆఫ్ఘ‌న్ ఆడిన 3 మ్యాచుల్లో 2 వాష్-అవుట్‌లలో ఓడిపోయింది. దీంతో మహ్మద్ నబీ తక్షణమే కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. 37 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేశాడు.

ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న నబీ
X

ప్రపంచ టీ-20 కప్ క్యాంపెయిన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప‌రాజ‌యాలు ఆ జ‌ట్టు కెప్టెన్‌ న‌బీని బాగా కుంగ‌దీశాయి. ఆఫ్ఘ‌న్ ఆడిన 3 మ్యాచుల్లో 2 వాష్-అవుట్‌లలో ఓడిపోయింది. దీంతో మహ్మద్ నబీ తక్షణమే కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. 37 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ ట్విట్టర్ ద్వారా ఈ ప్రకటన చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆప్ఘ‌న్ సెలక్షన్ కమిటీపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

''గత ఏడాది నుంచి మా జట్టు ఆట తీరు కెప్టెన్ కోరుకునే స్థాయికి గానీ, పెద్ద టోర్నమెంట్‌కు అవసరమైన స్థాయిలో కానీ లేదు. పైగా జ‌ట్టు ఎంపిక‌లో, మేనేజర్, సెలక్షన్ కమిటీ, నాకూ ఏకాభిప్రాయం లేదు. ఇది జట్టు బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది" అని నబీ వెల్ల‌డించారు.

పెర్త్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది, అయితే శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు గేమ్‌లలో అద్భుతంగా పోరాడింది. గత వారం మెల్‌బోర్న్‌లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఐర్లాండ్, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచ్‌లు రెండూ ఆప్ఘ‌న్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాయి. దీంతో వారు టీ-20 ప్ర‌పంచ క‌ప్ పోటీ నుంచి వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. కెప్టెన్‌గా వైదొలగాలని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ జ‌ట్టుకు అవసరమైనప్పుడు దేశం కోసం ఆడటం కొనసాగిస్తాన‌ని న‌బీ చెప్పుకొచ్చారు.

First Published:  5 Nov 2022 12:16 PM GMT
Next Story