Telugu Global
Sports

యో-యో టెస్టులో శుభ్ మన్ గిల్ బెస్ట్!

భారత క్రికెట్లో విరాట్ కొహ్లీని మించిన మొనగాడిగా యువఆటగాడు శుభ్ మన్ గిల్ అవతరించాడు. యో-యో టెస్టులో భారత అత్య్తుత్తమ క్రికెటర్ గా నిలిచాడు...

యో-యో టెస్టులో శుభ్ మన్ గిల్ బెస్ట్!
X

భారత క్రికెట్లో విరాట్ కొహ్లీని మించిన మొనగాడిగా యువఆటగాడు శుభ్ మన్ గిల్ అవతరించాడు. యో-యో టెస్టులో భారత అత్య్తుత్తమ క్రికెటర్ గా నిలిచాడు...

భారత క్రికెట్లో ఇప్పటి వరకూ ఫిట్టెస్ట్ క్రికెటర్ గా పేరుపొందిన 34 సంవత్సరాల విరాట్ కొహ్లీకి...23 సంవత్సరాల యువఆటగాడు శుభ్ మన్ గిల్ చెక్ చెప్పాడు.

ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారతజట్టు సభ్యులకు బీసీసీఐ నిర్వహించిన అత్యంత కఠినమైన, అత్యున్నత ప్రమాణాలకు మరో పేరైనా యో-యో టెస్టుల్లో సూపర్ ఫిట్ స్టార్ విరాట్ కొహ్లీ తొలిసారిగా రెండోస్థానానికి పడిపోయాడు.

విరాట్ ను మించిన శుభ్ మన్..

కర్నాటక క్రికెట్ సంఘానికి చెందిన అలూరు క్రికెట్ కాంప్లెక్స్ వేదికగా భారతజట్టు సభ్యులకు ఆరురోజుల శిక్షణ శిబిరంలో భాగంగా పలు రకాల ఫిట్ నెస్ టెస్టులు నిర్వహిస్తున్నారు.

బెంగళూరులోని భారత క్రికెట్ అకాడెమీకి చెందిన మెడికల్ సిబ్బంది, ట్రెయినర్ ఈ ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆసియాకప్ ప్రారంభానికి ముందే భారత క్రికెటర్ల ఫిట్ నెస్ ప్రమాణాలను నిర్థారించడానికి అత్యంత కఠిన తరమైన యో-యో టెస్టును నిర్వహించారు. ఇందులో మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ నిర్దేశించిన ప్రమాణాలను చేరుకోగలిగారు.

భారతజట్టుకు ఎంపికైన ఆటగాళ్లకు గత ఆరు సంవత్సరాలుగా బీసీసీఐ యో-యో టెస్టులు నిర్వహిస్తూ వస్తోంది. ఈ పరీక్షలో క్రికెటర్లందరూ పాల్గొనటం, తమ ఫిట్ నెస్ ను నిరూపించుకోడం తప్పని సరి చేసింది.

ఐర్లాండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన జస్ ప్రీత్ బుమ్రా,ప్రసిద్ధ కృష్ణ, తిలక్ వర్మ, సంజు శాంసన్ లకు కొద్దిరోజుల్లో యో-యో టెస్టు నిర్వహించనున్నారు.

గిల్ కు 18.7, విరాట్ కు 17.2...

భారత్ క్రికెటర్లకు ఎప్పుడు యో-యో టెస్టులు నిర్వహించినా విరాట్ కొహ్లీనే అగ్రస్థానంలో నిలవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే..ప్రస్తుత 2023 యో-యో టెస్టుల్లో మాత్రం సూపర్ ఫిట్ స్టార్ విరాట్ కొహ్లీనే యువఆటగాడు శుభ్ మన్ గిల్ అధిగమించాడు.

యో-యో టెస్టులో విరాట్ కు 17.2 పాయింట్లు వస్తే..శుభ్ మన్ గిల్ కు 18.7 పాయింట్లు రావడం విశేషం. ప్రస్తుత సీజన్లో శుభ్ మన్ క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ

అవిశ్రాంతంగా భారత్ కు ఆడుతూ వస్తున్నాడు. అయినా యో-యో టెస్టులో అత్యుత్తమ పాయింట్లు సాధించగలిగాడు.

కనీస ప్రమాణం 16.5 పాయింట్లు...

భారత క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టు విధానం ప్రవేశపెట్టిన బీసీసీఐ గత ఆరేళ్లుగా యో-యో టెస్టులు నిర్వహించడం కూడా తప్పని సరి చేసింది. యో-యో టెస్టులో నిర్దేశించిన ప్రమాణాలను అందుకొన్న ఆటగాళ్లకు మాత్రమే భారతజట్టులో సభ్యుడిగా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఆడటానికి అనుమతిస్తోంది.

ఆరేళ్ల క్రితం 16.1 పాయింట్లను అర్హత ప్రమాణంగా నిర్ణయించారు.రానురాను కనీస అర్హతను 16.5 పాయింట్లకు పెంచుతూ వచ్చారు. యో-యో టెస్టుల్లో భాగంగా ఆటగాళ్లకు ఏరోబిక్ ఎండ్యురెన్స్ ఫిట్ నెస్ టెస్టును నిర్వహిస్తారు. భారతజట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా 16.5 నుంచి 18 పాయింట్ల నడుమ సాధిస్తూ వచ్చారు.

భారతజట్టులో చోటు సంపాదించిన ఆటగాళ్లందరికీ యో-యో టెస్టుతో పాటు లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ సుగర్ లెవెల్, యూరిక్ యాసిడ్, కాల్షియం, విటమన్ బీ-12, క్రియాటినిన్, టెస్టోస్టెరోన్, డెక్సా టెస్టులు సైతం నిర్వహిస్తూ వస్తున్నారు.

బీసీసీఐ వైద్యబృందం ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఆటగాళ్ల ఫిట్ నెస్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు టీమ్ మేనేజ్ మెంట్ కు అందచేస్తూ వస్తోంది.

First Published:  26 Aug 2023 8:30 AM GMT
Next Story