Telugu Global
Sports

కొత్తజంటకు కుబేర కానుకలు!

KL Rahul Wedding Gift: క్రికెట్ వీరుడు, బాలీవుడ్ సుందరి రాహుల్- అత్యా శెట్టిల జంటపైన ఖరీదైన కానుకల వర్షం కురిసింది.

కొత్తజంటకు కుబేర కానుకలు!
X

ఉన్నోడి పెళ్లికి..లేనోడి పెళ్లికి ఎంతో తేడా. తేడా ఎంతంటే ఆకాశానికి, భూమికి ఉన్నంత. కొద్దిరోజుల క్రితమే వివాహంతో ఒక్కటైన క్రికెట్ వీరుడు, బాలీవుడ్ సుందరి రాహుల్- అత్యా శెట్టిల జంటపైన ఖరీదైన కానుకల వర్షం కురిసింది.

భారత మాజీ కెప్టెన్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి, మోడల్ అత్యా శెట్టిల వివాహం కొద్దిరోజుల క్రితమే..ఆకాశమంత పందిరి, భూదేవంత మండపం అన్నస్థాయిలో ముగిసింది.

బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి పెద్దకుమార్తె అత్యాశెట్టి గత మూడేళ్లుగా రాహుల్ తో డేటింగ్ చేస్తూ వచ్చింది. చివరకు ముంబైలోని సునీల్ శెట్టి విలాసవంతమైన.. ఖండాలా

ఫామ్ హౌస్ వేదికగా కేవలం వందమంది మాత్రమే కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రముఖుల సమక్షంలో వేడుకగా వివాహవేడుక ముగిసింది.

పెళ్లివేడుకలతో మురిసి, అలసిపోయిన కొత్తజంట ను విలాసవంతమైన ఫ్లాట్, ఖరీదైన కార్లు, వజ్రవైడూర్యాలతో కూడిన అత్యంత విలువైన నగలు, వాచీలతో సహా పలురకాల కానుకలు ముంచెత్తాయి.

కొహ్లీ బీఎమ్ డబ్ల్యు- ధోనీ కవాసకీ నింజా..

కొత్తపెళ్ళి కొడుకు రాహుల్ కు భారత మాజీ కెప్టెన్లు విరాట్ కొహ్లీ, మహేంద్ర సింగ్ దోనీ ఖరీదైన, విలువైన కానుకలే ఇచ్చారు. విరాట్- అనుష్కజంట 2 కోట్ల 70 లక్షల రూపాయల ఖరీదు చేసే బీఎమ్ డబ్ల్యు కారును బహుకరిస్తే..బైక్ ల వీరుడు మహేంద్రసింగ్ ధోనీ 80 లక్షల రూపాయల విలువైన కవాసకీ నింజా బైక్ ను కానుకగా ఇచ్చాడు. కొహ్లీ, ధోనీ కలసి రాహుల్ కు 3 కోట్ల 50 లక్షల రూపాయల కానుకలు అందచేయటం విశేషం.

అత్యాకు బాలీవుడ్ స్టార్ల కానుకలు..

రాహుల్ భార్య అత్యాశెట్టి బాలీవుడ్ హీరోయిన్, మోడల్ మాత్రమే కాదు...ప్రముఖ హీరో సునీల్ శెట్టి ముద్దుల కుమార్తె కావడంతో..పెళ్లికానుకలు వెల్లువలా వచ్చాయి.

అత్యాశెట్టికి తల్లిదండ్రులు మనా-సునీల్ కలసి 50 కోట్ల రూపాయల విలువ చేసే విలాసవంతమైన ఓ అపార్ట్ మెంట్ ను ఇచ్చారు.

ఇక..సునీల్ శెట్టి స్నేహితుడు, సూపర్ హీరో సల్మాన్ ఖాన్ కోటీ 60 లక్షల రూపాయలు ఖరీదు చేసే అడీ కారును, జాక్ ష్రోఫ్ 30 లక్షల రూపాయల విలువైన బ్రాండెడ్ వాచీని, అర్జున్ కపూర్ కోటీ 50 లక్షల రూపాయలు విలువ చేసే ప్లాటినం బ్రాస్ లెట్ ను కానుకలుగా ఇచ్చి ఆశీర్వదించారు.

మొత్తం మీద..కొత్తజంటకు కానుకల రూపంలో 100 కోట్ల రూపాయల వరకూ వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఉన్నోళ్ల పెళ్లి కానుకలు కోట్ల రేంజ్ లో లేకపోతే..కుబేరుడు, అదానీ, అంబానీలు చిన్నబుచ్చుకోరు. రాజుతలచుకొంటే దెబ్బలకు కొదవా, కలియుగ కుబేరులు తలచుకొంటే కానుకలకు కొదవా మరి..అంటూ ఆశ్చర్యపోక తప్పదు.

వేలకోట్ల సంపద కలిగిన అంబానీ చిన్నకొడుకు అనంత్ పెళ్లివేడుకలకు రాని ప్రచారం..క్రికెట్ వీరుడు- బాలీవుడ్ సుందరిల పెళ్లికి రావటం హాశ్చర్యమే మరి.!

Next Story