Telugu Global
Sports

టాప్‌ లేపేసిన బూమ్రా

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లో అగ్రస్థానంలోకి

టాప్‌ లేపేసిన బూమ్రా
X

ఇండియన్‌ స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బూమ్రా టాప్‌ లేపేశాడు. టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లో టాప్‌ ప్లేస్‌ కొట్టేశారు. ఒక్క పాయింట్‌ తేడాతో ఇండియన్‌ స్టార్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ను వెనక్కి నెట్టి ఫస్ట్‌ ర్యాంక్‌ సొంతం చేసుకున్నాడు. బూమ్రా 870 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌ లో ఉండగా అశ్విన్‌ 869 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. బంగ్లాదేశ్‌ తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ లో బూమ్రా, అశ్విన్‌ పోటాపోటీగా బౌలింగ్‌ చేసి తలా 11 వికెట్లు పడగొట్టారు. అశ్విన్‌ కన్నా బూమ్రా తక్కువ రన్స్‌ ఇవ్వడంతో టాప్‌ ప్లేస్‌ దక్కింది. ఆస్ట్రేలియా బౌలర్లు హాజల్‌ ఉడ్‌, పాట్‌ కమిన్స్‌ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. సౌత్‌ ఆఫ్రికా బౌలర్‌ కసిగో రబడా సైతం నాలుగో ప్లేస్‌ దక్కించుకున్నారు. భారత ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా ఆరో ప్లేస్‌ లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌ మన్‌ జో రూట్‌ బ్యాటింగ్‌ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్‌ స్టార్ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌ సెకండ్‌ ప్లేస్‌ లో ఉన్నారు. ఇండియన్‌ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ మూడో స్థానంలో ఉన్నారు. విరాట్‌ కోహ్లీ ఆరో స్థానంలో, రిషబ్‌ పంత్‌ 9వ ర్యాంకులో, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 15వ స్థానంలో ఉన్నారు. టీమ్‌ ర్యాంకింగ్స్‌ ఆస్ట్రేలియా టాప్‌, టీమ్‌ ఇండియా సెకండ్‌ ప్లేస్‌ లో ఉన్నాయి. ఇంగ్లండ్‌ టీమ్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది.

First Published:  2 Oct 2024 2:58 PM GMT
Next Story