Telugu Global
Sports

International Women's Day 2024: క్రీడా వేదికపై మహిళా "మణులు"

International Women's Day 2024: ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు.

International Womens Day 2024: క్రీడా వేదికపై మహిళా మణులు
X

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా తమ సత్తాచాటుతున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల నుంచి.. దేశాన్ని రక్షించే త్రివిధ దళాల వరకు.. సర్పంచి నుంచి రాష్ట్రపతి పీఠం వరకు ప్రతి చోటా పురుషులకు దీటుగా వనితలునిలుస్తున్నారు.

రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల్లో దేశ కీర్తిపతాకను రెపరెపలాడిస్తున్నారు. బాక్సింగ్ ,స్కీయింగ్ , బ్యాడ్మింటన్ , క్రికెట్ , టెన్నిస్ ఇలా ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. ఒలింపిక్స్, ఆసియాక్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ యూత్ గేమ్స్, క్రికెట్ ప్రపంచకప్ ఇలా పలు రకాల అంతర్జాతీయ క్రీడల్లో రాణులుగా నిలుస్తున్నారు.

అది 1986 వ సంవత్సరం. ఆడపిల్లలు తలవంచే నడవాలి అనే రోజులే ఇంకా. కానీ అదే కాలంలో ఓ మహిళ పరుగులు పెట్టింది. ఒకేసారి ఐదు పతకాలు గెలిచి ఖండంతర కీర్తిని సాధించిన ఆ మహిళే పరుగుల రాణి పిటి ఉష. అలాగే నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్ లో భారత్ కు పతకం సాధించిన తొలి భారత మహిళ మరెవరో కాదు తెలుగుతేజం కరణం మల్లీశ్వరి. పురుషులకే పరిమితమైనా బాక్సింగ్‌ లో బంగారు పతకాలతో దేశప్రతిష్టను పెంచిన మహిళ మేరీ కోమ్. మాగ్నిఫిసెంట్ మేరీ ఐదుసార్లు ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్, ఆరు ప్రపంచ ఛాంపియన్‏షిప్‏లలో ఒక్కో విభాగంలో పతకాలను సాధించింది.

ఇక టీమిండియా కెప్టెన్ మిథాలీ. పురుషు క్రికెట్ లో సచిన్ ఎలాగో..మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ అలా. వన్డేల్లో 6000 పరుగులు మార్కును అధిగమించిన ఏకైక మహిళ క్రికెటర్. అలాగే, టీమిండియాను ప్రపంచకప్ ఫైనల్ కు రెండు సార్లు నడిపించిన ఏకైక భారత క్రికెట్ కెప్టెన్. భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారుండరు. 16 ఏళ్ళ వయసులోనే టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది.



మహిళల డబుల్స్ విభాగంలో 91 వారాల పాటు సానియా మీర్జా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అక్టోబరు 2005లో టైం పత్రిక సానియాను “50 హీరోస్ ఆఫ్ ఆసియా”గా పేర్కొంది. సైనా నెహ్వాల్ ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఎన్నో రికార్డులను తిరగరాసిన సైనా. భారత్ తరఫున ప్రపంచంలోనే నెం.1 ర్యాంక్ సాధించిన తొలి క్రీడాకారిణి. పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన తెలుగుతేజం సింధు ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలు.

వీరే కాదు తొలి భారత మహిళా రెజ్లర్ గీతా ఫోగాట్, సాక్షి మాలిక్, చెస్ గ్రాండ్ మాస్టర్లు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, విలువిద్య క్రీడాకారిణి దీపికా కుమారి, మంచు కొండలు, లోయలే వేదికగా జరిగే ఆల్పైన్ స్కీయింగ్ లో పతకం సాధించిన భారత తొలిమహిళ అంచల్ ఠాకూర్ ఇలా ఎందరో మంది మహిలఉ మన దేశ క్రీడా చరిత్రలో చోటు సంపాదించుకున్నారు.

First Published:  8 March 2024 7:55 AM GMT
Next Story