Telugu Global
Sports

భారత్ దెబ్బకు న్యూజిలాండ్ టాప్ ర్యాంక్ ఢమాల్!

న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా భారత్ 4 నుంచి 3వ ర్యాంక్ కు చేరుకోగలిగింది. ఇప్పటి వరకూ టాప్ ర్యాంకర్ గా ఉన్న కివీజట్టు రెండోర్యాంక్ కు పడిపోయింది.

భారత్ దెబ్బకు న్యూజిలాండ్ టాప్ ర్యాంక్ ఢమాల్!
X

న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ మొదటి రెండుమ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా భారత్ 4 నుంచి 3వ ర్యాంక్ కు చేరుకోగలిగింది. ఇప్పటి వరకూ టాప్ ర్యాంకర్ గా ఉన్న కివీజట్టు రెండోర్యాంక్ కు పడిపోయింది.....

ఐసీసీ వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత్ ఓ స్థానం మెరుగుపరచుకొంది. ఇప్పటి వరకూ 4వ ర్యాంకులో ఉన్న భారత్ ..టాప్ ర్యాంకర్ న్యూజిలాండ్ పై సాధించిన వరుస విజయాలతో ఓ ర్యాంకు పైకి ఎగబాక గలిగింది.

కివీస్ కు దెబ్బ మీద దెబ్బ!

పాకిస్థాన్ ను పాక్ గడ్డపై 2-1తో ఓడించడం ద్వారా భారత్ తో సిరీస్ కు తరలి వచ్చిన ప్రపంచ నంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలివన్డేలో 12 పరుగులతో నెగ్గిన భారత్..రాయ్ పూర్ వేదికగా ముగిసిన రెండోవన్డేలో చెలరేగిపోయింది.

న్యూజిలాండ్ ను 108 పరుగులకే కుప్పకూల్చడం ద్వారా 8 వికెట్ల విజయంతో సిరీస్ లో 2-1తో పైచేయి సాధించింది. అంతేకాదు..2023 సీజన్ తొలిసిరీస్ లో శ్రీలంకను 3-0తో చిత్తు చేసిన భారత్ కు ఇది వరుసగా రెండోసిరీస్ విజయం కావడం విశేషం.

భారత్ చేతిలో వరుస పరాజయాలతో న్యూజిలాండ్ టాప్ ర్యాంక్ నుంచి రెండోర్యాంక్ కు పడిపోయింది.

నయానంబర్ వన్ ఇంగ్లండ్...

న్యూజిలాండ్ రెండో ర్యాంక్ కు పడిపోడంతో ఇప్పటి వరకూ రెండోర్యాంకర్ గా ఉన్న ఇంగ్లండ్ తిరిగి టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగింది. న్యూజిలాండ్ 113 ర్యాంకింగ్ పాయింట్లు, 3166 ఓవరాల్ పాయింట్లతో రెండోర్యాంక్ కు పడిపోయింది.

భారత్ మూడు, ఆస్ట్ర్రేలియా నాలుగు, పాకిస్థాన్ ఐదు, దక్షిణాఫ్రికా ఆరు, బంగ్లాదేశ్ ఏడు, శ్రీలంక ఎనిమిది, అఫ్ఘనిస్తాన్ 9, వెస్టిండీస్ 10 ర్యాంకుల్లో నిలిచాయి. ఐర్లాండ్ 11, స్కాట్లాండ్ 12, జింబాబ్వే 13 ర్యాంకులకు పరిమితం కావాల్సి వచ్చింది.

ర్యాంకింగ్స్ ఆధారంగానే 2023 వన్డే ప్రపంచకప్ కు అర్హత సాధించే జట్ల జాబితాను ఐసీసీ ఖరారు చేయనుంది.

First Published:  22 Jan 2023 7:12 AM GMT
Next Story