Telugu Global
Sports

టీ-20 ప్రపంచకప్ కు భారతజట్టు రెడీ!

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో ఫాస్ట్ బౌలర్ల జోడీ జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ కు చోటు దక్కింది.

టీ-20 ప్రపంచకప్ కు భారతజట్టు రెడీ!
X

ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో ఫాస్ట్ బౌలర్ల జోడీ జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ కు చోటు దక్కింది. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని స్టాండ్ బైగా ఎంపిక చేశారు.....

ఫాస్ట్ , స్వింగ్ , బౌన్సీ పిచ్ లతో కూడిన ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించింది.

గాయాలతో గత కొద్దివారాలుగా జట్టుకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్లు జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లకు తుదిజట్టులో చోటు దక్కింది.

Advertisement

వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, స్వింగ్ కింగ్ దీపక్ చహార్ లతో పాటు యువలెగ్ స్పిన్నర్ దీపక్ చహార్, శ్రేయస్ అయ్యర్ లను స్టాండ్ బైలుగా ఎంపిక చేశారు.

ఆసియాకప్ లో పాల్గొంటూ కాలినరం గాయంతో శస్త్రచికిత్సతో విశ్రాంతి తీసుకొంటున్న సూపర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా పక్కన పెట్టారు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో కెఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ , సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ తో పాటు స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహాల్, అక్షర్ పటేల్ లకు చోటు దక్కింది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ సైతం తుదిజట్టుకు ఎంపికయ్యారు.

సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికాజట్లతో జరుగనున్న మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ భారతజట్టులో సభ్యులుగా పాల్గోనున్నారు.

ఆస్ట్రేలియా బయలుదేరటానికి ముందు భారతజట్టు ప్రపంచకప్ కు సన్నాహకంగా కేవలం ఆరు టీ-20 మ్యాచ్ ల్లో మాత్రమే పాల్గోనుంది.

Next Story