Telugu Global
Sports

టీమిండియాకు షాక్‌.. ఆసీస్‌తో మ్యాచ్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం

యాంటీ బయాటిక్స్‌ తీసుకుని ఆట ఆడే అవకాశం ఉందని, అది పూర్తిగా మెడికల్ టీమ్‌ నిర్ణయంపైనే ఆధారం పడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

టీమిండియాకు షాక్‌.. ఆసీస్‌తో మ్యాచ్‌కు స్టార్‌ ప్లేయర్‌ దూరం
X

వరల్డ్‌కప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలో దిగనున్న టీమిండియాకు మొద‌టి మ్యాచ్‌కు ముందే షాక్‌ తగిలింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్ గిల్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నట్లు సమాచారం. చెన్నై చేరుకున్నప్పటి నుంచి గిల్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడని, అతనికి వైద్య‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీమ్‌ మేనేజ్‌మెంట్ తెలిపింది.

అయితే శుభ్‌మన్‌ గిల్‌కు సాధారణ వైరల్‌ జ్వరం అయితే.. యాంటీ బయాటిక్స్‌ తీసుకుని ఆట ఆడే అవకాశం ఉందని, అది పూర్తిగా మెడికల్ టీమ్‌ నిర్ణయంపైనే ఆధారం పడి ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సాధారణంగా డెంగ్యూ సోకిన వారు కోలుకునేందుకు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది.

ఒక వేళ గిల్‌ మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానంలో ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలున్నాయి. శుభ్‌మ‌న్ గిల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఈ కేలండర్ ఈయర్‌లో టీమిండియా తరఫున అత్యధిక రన్స్‌ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఏడాది 72.35 సగటు, 105 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 1,230 పరుగులు చేశాడు. ఈ ఏడాదిలో 5 సెంచరీలతో పాటు ఐదు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.

First Published:  6 Oct 2023 4:59 AM GMT
Next Story