Telugu Global
Sports

రెండు బృందాలుగా ప్రపంచకప్ కు భారత క్రికెటర్లు!

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత ఆటగాళ్లు బృందాలు, బృందాలుగా అమెరికా ప్రయాణం కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.

రెండు బృందాలుగా ప్రపంచకప్ కు భారత క్రికెటర్లు!
X

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారత ఆటగాళ్లు బృందాలు, బృందాలుగా అమెరికా ప్రయాణం కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు.

దేశవిదేశాలలోని కోట్లాదిమంది అభిమానులను గత కొద్ది వారాలుగా అలరిస్తూ వస్తున్న ఐపీఎల్ -17వ సీజన్ తొలి అంచె రౌండ్ రాబిన్ లీగ్ దశ పోటీలు ముగింపు దశకు చేరుకోడంతో ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న రెండోదశ ప్లే-ఆఫ్ రౌండ్ కు ఓ వైపు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అయితే..ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించడంలో విఫలమైన ఫ్రాంచైజీలలోని భారత టీ-20 ప్రపంచకప్ జట్టు సభ్యులు మాత్రం నేరుగా అమెరికాకు ప్రయాణం కానున్నారు.

మే 24న భారత తొలి బృందం ప్రయాణం...

వెస్టిండీస్, అమెరికా క్రికెట్ బోర్డుల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2నుంచి ప్రారంభంకానున్న 2024 -ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టు..రెండు బృందాలుగా అమెరికాకు ప్రయాణం కానున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా ప్రకటించారు.

ఐపీఎల్ ప్లే-ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించని జట్లలోని భారత ఆటగాళ్ల తొలి బ్యాచ్ ఈనెల 24న అమెరికా పయనమవుతుందని..ముంబై జట్టు ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోని కారణంగా అందులోని రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రాతో పాటు మరి కొందరు ఆటగాళ్లు ఉంటారని బోర్డు కార్యదర్శి తెలిపారు.

మే 26న ఐపీఎల్ టైటిల్ పోరు ముగిసిన తరువాత రెండో బృందం బయలు దేరుతుందని చెప్పారు.

భారత తొలిబ్యాచ్ లో చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లతో పాటు సహాయక బృందం కూడా ఉంటుందని వివరించారు.

విశ్రాంతి ప్రసక్తే లేదు....

ఐపీఎల్ తో తీవ్రంగా అలసిపోయిన ఆటగాళ్లకు ..ప్రపంచకప్ ప్రారంభానికి ముందు విశ్రాంతి ఇచ్చే ప్రసక్తే లేదని బీసీసీఐ కార్యదర్శి తేల్చి చెప్పారు. ఐపీఎల్ లో రాణించిన భారతజట్టు సభ్యులకు ప్రపంచకప్ లో సైతం సత్తా చాటుకొనే అవకాశం సిద్ధంగా ఉందని అన్నారు.

సన్ రైజర్స్ తరపున అదరగొట్టిన ఆస్ట్ర్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కు..ముంబై ఇండియన్స్ తరపున ఆడిన జస్ ప్రీత్ బుమ్రా..ప్రపంచకప్ లో భారత ఓపెనింగ్ బౌలర్ గా సవాలు విసురుతాడని..అది తలచుకొంటేనే ఎంతో ఉత్కంఠను కలిగిస్తోందని జే షా చెప్పారు.

మయాంక్ యాదవ్ కు బీసీసీఐ అండ...

లక్నో సూపర్ జెయింట్స్ మెరుపు ఫాస్ట్ బౌలర్, గాయంతో ఐపీఎల్ కు దూరమైన మయాంక్ యాదవ్ కు బీసీసీఐ అండగా నిలుస్తుందని, మయాంక్ కు తమ అండదండలు ఉంటాయని తెలిపారు. మయాంక్ కు ఫాస్ట్ బౌలర్ల కాంట్రాక్టు కింద ఏడాదికి కోటి రూపాయలు చెల్లిస్తామని, అతని ఫిట్ నెస్ , శిక్షణ కార్యక్రమాలను బీసీసీఐ నిపుణుల బృందమే చూసుకొంటుందని తెలిపారు.

ఇప్పటికే ..బీసీసీఐ ఫాస్ట్ బౌలర్ల కాంట్రాక్టులో ఆకాశ్ దీప్, విజయ్ కుమార్ వైశాక్, ఉమ్రాన్ మాలిక్, యాష్ దయాల్, విద్వత్ కావేరప్ప ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

First Published:  14 May 2024 1:32 PM GMT
Next Story