Telugu Global
Sports

రేటు పెరిగినా..హాటుకేకుల్లా అమ్ముడైన హైదరాబాద్ వన్డే టికెట్లు!

హైదరాబాద్ వన్డే టికెట్లు హాటుకేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డేకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలిచింది.

రేటు పెరిగినా..హాటుకేకుల్లా అమ్ముడైన హైదరాబాద్ వన్డే టికెట్లు!
X

హైదరాబాద్ వన్డే టికెట్లు హాటుకేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డేకి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా నిలిచింది...

న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ ముగిసిందో లేదో..కేవలం మూడురోజుల వ్యవధిలోనే మరో వన్డే అంతర్జాతీయ సిరీస్ కు రంగం సిద్ధమయ్యింది. వన్డేల్లో ప్రపంచ నంబర్ వన్ న్యూజిలాండ్ కు 4వ ర్యాంకర్ భారత్ సవాలు విసురుతోంది.

మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని తొలివన్డే జనవరి 18 ( బుధవారం )న హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆతిథ్య హైదరాబాద్ క్రికెట్ సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

ఆన్ లైన్ లో టికెట్ల సేల్ పూర్తి...

భారత్- న్యూజిలాండ్ జట్ల తొలివన్డేమ్యాచ్ టికెట్ల విక్రయాన్ని ఆన్ లైన్ ద్వారా హైదరాబాద్ క్రికెట్ సంఘం పూర్తి చేసింది. అమ్మకానికి ఉంచిన మొత్తం 39వేల టికెట్లను దశలవారీగా ఆన్ లైన్ లో విక్రయానికి ఉంచారు.

నాలుగుమాసాల క్రితం జరిగిన మ్యాచ్ టికెట్ల విషయంలో జరిగిన లోటుపాట్లను సవరించుకొని..వివాదాలకు అతీతంగా, పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా టికెట్లను అందుబాటులో ఉంచారు.

పేటీఎం యాప్ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచారు. మొదటి రోజు 6 వేల టికెట్లు అందుబాటులో ఉండగా, మొత్తం39 వేల టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంచనున్నారు. జనవరి 16 వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించారు.

మ్యాచ్ రోజున స్టేడియంలోకి అడుగుపెట్టాలంటే ఫిజికల్ టికెట్ తప్పనిసరి. ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియంలో క్యూఆర్ కోడ్‌తో ఈ ఫిజికల్ టికెట్లను కలెక్ట్‌ చేసుకోవాలి. ఇందుకోసం రీడీమ్‌ కౌంటర్‌ల వద్ద ఫోటో ఐడీతో పాటు పేటీఎం నుంచి వచ్చిన ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్‌ను చూపించాల్సి ఉంటుంది.

కనీస టికెట్ ధర 850 రూపాయలు..

భారత్- న్యూజిలాండ్ జట్ల ప్రస్తుత మ్యాచ్ కోసం రాజీవ్ స్టేడియం కెపాసిటీని 39 వేల112గా ఖరారు చేశారు. ఇందులో 9 వేల695 టిక్కెట్లను కాంప్లిమెంటరీల కోటాలో ఉంచారు.

మిగిలిన 29,417 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించారు. కాగా మొదటి రోజు 6,000 టిక్కెట్లు అందుబాటులోకి రాగా శనివారం (జనవరి 14) నుంచి రోజూ 7,000 టిక్కెట్లు చొప్పున అందుబాటులో ఉంచారు.

ఇక టికెట్ల ధరల విషాయనికొస్తే.. రూ.850 మొదలు రూ.1,000, రూ.1,250, రూ.1,500, రూ.2,500, రూ.5,000, రూ.9,000, రూ.17,700, రూ.20,650 వరకు ఉన్నాయి.

ఒక్కరు కేవలం నాలుగు టిక్కెట్ల వరకు మాత్రమే కొనుగోలు చేసేలా నిబంధనలు అమలు చేశారు.

పాకిస్తాన్ తో జరిగిన సిరీస్ లో విజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు..రెండురోజుల క్రితమే హైదరాబాద్ చేరుకొని జోరుగా ప్రాక్టీసు చేసింది. మరోవైపు ఆతిథ్య భారత్..తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో ముగిసిన ఆఖరి వన్డేలో ప్రపంచ రికార్డు విజయంతో సిరీస్ కైవసం చేసుకొని..కొద్దిగంటల క్రితమే నగరానికి చేరుకోగలిగింది.

జనవరి 18న మధ్యాహ్నం 1-30 గంటలకు తీన్మార్ సిరీస్ లోని తొలిసమరం ప్రారంభంకానుంది.

First Published:  17 Jan 2023 6:04 AM GMT
Next Story