Telugu Global
Sports

బ‌జ్‌బాల్ అయినా .. మ‌న ముందు బలాదూరే

బ‌జ్‌బాల్‌తో గెలుద్దామ‌నుకున్న ఇంగ్లీష్ జ‌ట్టుకు తొలి సిరీస్ ఓట‌మిని రుచిచూపించారు మ‌న కుర్రాళ్లు.

బ‌జ్‌బాల్ అయినా .. మ‌న ముందు బలాదూరే
X

టెస్ట్ మ్యాచ్‌లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో శ‌ర‌వేగంగా ప‌రుగులు చేసి ప్ర‌త్య‌ర్థిని ఉక్కిరి బిక్కిరిచేసే బ‌జ్‌బాల్ వ్యూహంతో ఇండియాను గెలుద్దామ‌ని వ‌చ్చిన ఇంగ్లాండ్ జ‌ట్టుకు మ‌న‌వాళ్లు దిమ్మ‌దిరిగే షాకిచ్చారు. మొద‌టి టెస్ట్‌లో ఓడినా త‌ర్వాత మూడు టెస్ట్‌లు గెలిచి సిరీస్ ప‌ట్టేశారు. ఇక 5వ టెస్ట్ నామ‌మాత్ర‌మే. బ‌జ్‌బాల్‌తో గెలుద్దామ‌నుకున్న ఇంగ్లీష్ జ‌ట్టుకు తొలి సిరీస్ ఓట‌మిని రుచిచూపించారు మ‌న కుర్రాళ్లు.

బ‌జ్‌బాల్ అంటే..

బ‌జ్‌బాల్‌.. టెస్ట్ క్రికెట్‌కు టీ20 వేగం అందించిన స్కీమ్‌. న్యూజిలాండ్ మాజీ ప్లేయ‌ర్ బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ త‌ను ఆట‌గాడిగా ఉన్న‌ప్పుడు ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌లు ఆడిన‌ట్టే ఇంగ్లాండ్‌కు కోచ్‌గా వ‌చ్చాక ఆ జ‌ట్టుకూ అదే నూరిపోశాడు. ఓవ‌ర్‌కు 2,3 ప‌రుగుల ర‌న్‌రేట్ న‌మోద‌య్యే టెస్ట్ క్రికెట్‌లో నాలుగైదు ప‌రుగుల చొప్పున ప‌రుగులు బాదేయ‌డమే బ‌జ్ బాల్‌. ఒక్కరోజులోనే 350, 400 ప‌రుగులు స్కోరు చేసి ప్రత్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేసి, అదే ఊపులో గెలిచేయ‌డం ఇంగ్లాండ్ స్టైల్‌గా మార్చారు కోచ్ మెక్‌క‌ల్ల‌మ్‌, కెప్టెన్ బెన్ స్టోక్స్.

తొలి సిరీస్ ప‌రాజ‌యం మ‌న‌మే చూపించాం

2022 నుంచి ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ గేమ్‌తో దూసుకెళ్తోంది. 22 టెస్ట్‌ల్లో ఏకంగా 14 నెగ్గింది. ఏడు ఓడింది. ఈ ధ‌నాధ‌న్ ఆట‌తీరుతో గ‌త రెండేళ్లుగా ఆ టీమ్ అజేయంగా నిలుస్తోంది. 5 టెస్ట్ సిరీస్‌లు నెగ్గింది. మూడింటిని డ్రా చేసుకుంది. మ‌న‌వాళ్లు మాత్రం ఆ బ‌జ్‌బాల్‌ను లాగి గ్రౌండ్ బ‌య‌టికి కొట్టేశారు.

First Published:  27 Feb 2024 6:10 AM GMT
Next Story