Telugu Global
Sports

భారత హాకీజట్టుకు అత్యుత్తమ ర్యాంకు!

ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ విజేత భారత హాకీజట్టు గత దశాబ్దకాలంలో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ప్రపంచంలోనే మూడో అత్యుత్తమజట్టుగా నిలిచింది.

భారత హాకీజట్టుకు అత్యుత్తమ ర్యాంకు!
X

ఎనిమిదిసార్లు ఒలింపిక్స్ విజేత భారత హాకీజట్టు గత దశాబ్దకాలంలో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ప్రపంచంలోనే మూడో అత్యుత్తమజట్టుగా నిలిచింది...

భారతహాకీ చరిత్రలోనే తొలిసారిగా భారతజట్టు ప్రపంచ హాకీ సమాఖ్య ర్యాంకింగ్స్ మూడుజట్లలో ఒకటిగా నిలిచింది. గత ఏడాది నుంచి ప్రపంచ 5వ ర్యాంక్ జట్టుగా నిలిచిన భారత్..కొద్ది మాసాల క్రితమే నాలుగో ర్యాంక్ కు ఎదిగింది.

చెన్నై వేదికగా ముగిసిన 2023 ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో భారత్ తిరుగులేని విజేతగా నిలవడం ద్వారా అత్య్తుత్తమంగా ప్రపంచ మూడో ర్యాంక్ లో నిలిచింది.

ఇంగ్లండ్ ను అధిగమించిన భారత్...

ప్రపంచ పురుషుల హాకీ ర్యాంకింగ్స్ లో ఇప్పటి వరకూ మూడోర్యాంకులో ఉంటూ వచ్చిన ఇంగ్లండ్ ను భారత్ 2771.35 పాయింట్లతో అధిగమించి అధిగమించింది.

భారత్ మూడో ర్యాంక్ లో నిలవడంతో ఇంగ్లండ్ నాలుగో ర్యాంక్ కు పడిపోయింది.

2021లో టోక్యో వేదికగా ముగిసిన ఒలింపిక్స్ లో భారత్ కాంస్య పతకం గెలుచుకొన్న నాటినుంచి అత్యంత నిలకడగా రాణిస్తూ వస్తోంది. ప్రపంచ స్థాయి పోటీలతో పాటు..ఆసియాలో టోర్నీలలోనూ తిరుగులేని విజయాలతో నంబర్ వన్ జట్టుగా నిలిచింది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ చేతిలో 3-4 గోల్స్ తేడాతో ఓడి రన్నరప్ స్థానంతో సరిపెట్టుకొన్నమలేసియా 9వ ర్యాంక్ సాధించింది. సెమీఫైనలిస్ట్ దక్షిణ కొరియా 11వ ర్యాంక్, మాజీ చాంపియన్ పాకిస్థాన్ 16వ ర్యాంక్ కు పడిపోయాయి.

ఒలింపిక్స్ హాకీలో భారత్ అరుదైన రికార్డు...

నాలుగు సంవత్సరాలకు ఓసారి జరిగే ఒలింపిక్స్ పురుషుల హాకీలో అత్యధికంగా ఎనిమిది బంగారు పతకాలు సాధించిన ఏకైకజట్టు భారత్ మాత్రమే. 4 దశాబ్దాల విరామం తర్వాత తిరిగి టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడం ద్వారా ప్రపంచ మేటిజట్లలో ఒకటిగా గుర్తింపు సంపాదించింది.

2021 తర్వాత నుంచి భారత్ మ్యాచ్ మ్యాచ్ కూ, టోర్నీ టోర్నీకి తన ఆటతీరును మెరుగుపరచుకొంటూ వస్తోంది. ఇదే క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మూడో ర్యాంక్ సంపాదించగలిగింది.

ఆసియా చాంపియన్స్ ట్రోఫీని నాలుగోసారి గెలుచుకొన్న భారత్...సెప్టెంబర్ 23 నుంచి చైనా నగరం హాంగ్జు వేదికగా ప్రారంభంకానున్న ఆసియాక్రీడల హాకీలో సైతం బంగారు పతకం సాధించాలన్న లక్ష్యంతో ఉంది.

First Published:  14 Aug 2023 5:30 AM GMT
Next Story