Telugu Global
Sports

ఆసియా గేమ్స్‌లో భారత్‌ హిస్టరీ.. పతకాల సెంచరీ కొట్టిన అథ్లెట్లు

ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న మొత్తం పతకాల సంఖ్య 100కు చేరగా.. ఇందులో గోల్డ్‌ మెడల్స్-25, రజతం - 35, కాంస్యం - 40 పతకాలున్నాయి. మొత్తం పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఆసియా గేమ్స్‌లో భారత్‌ హిస్టరీ.. పతకాల సెంచరీ కొట్టిన అథ్లెట్లు
X

చైనా హంగ్‌జౌ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అథ్లెట్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పతకాల సెంచరీ కొట్టింది. శుక్రవారమే 95 మెడల్స్‌ సాధించిన ఇండియన్ అథ్లెట్లు.. మరో ఐదు పతకాలను ఖాయం చేశారు. నేడు పతకాల పట్టికకు మరో 5 మెడల్స్ జోడించడంతో భారత్‌ మెడల్స్ నంబర్‌ వందకు చేరుకుంది. మహిళల కబడ్డీ ఫైనల్‌లో డ్రాగన్‌ జట్టును చిత్తు చేసిన భారత్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఇక ఆర్చరీలో నాలుగు మెడల్స్‌ను కైవసం చేసుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో జ్యోతి సురేఖ గోల్డ్‌ మెడల్‌ ఒడిసిపట్టుకుంది. ఇదే ఆర్చరీ విభాగంలో అదితి గోపీచంద్‌ కాంస్యం సాధించింది. ఆసియన్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లకు ఇవాళ చివరి రోజు. ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న మొత్తం పతకాల సంఖ్య 100కు చేరగా.. ఇందులో గోల్డ్‌ మెడల్స్-25, రజతం - 35, కాంస్యం - 40 పతకాలున్నాయి. మొత్తం పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ఇండోనేషియా వేదికగా జరిగిన లాస్ట్ ఎడిషన్‌లో ఇండియా 70 మెడల్స్ సాధించింది. ఇప్పటివరకూ అదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఇందులో 16 గోల్డ్‌ మెడల్స్‌, 23 రజతాలు, 31 కాంస్య పతకాలున్నాయి. అయితే షూటర్లు -22, ట్రాక్‌ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు -29 మెడల్స్ సాధించడంతో ఇండోనేషియాలో సాధించిన పతకాల రికార్డును బుధవారమే దాటేశారు ఇండియన్ అథ్లెట్లు.

ఈ ఏడాది అనేక సర్‌ప్రైజ్‌ మెడల్స్ సాధించింది ఇండియన్ అథ్లెట్స్ టీమ్‌. టేబుల్‌ టెన్నిస్‌లో శక్తివంతమైన చైనాను మట్టికరిపించిన సుతీర్థ ముఖర్జీ, అయ్హికా ముఖర్జీలు కాంస్యం పతకం సాధించి ఆశ్చర్యపరిచారు. మహిళల 5వేల మీటర్ల పరుగులో పరుల్ చౌదరి సంచలనం సృష్టించింది. జావెలిన్ త్రోయర్‌ కోషోర్‌ కుమార్‌ సైతం అద్భుతమైన ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించాడు.

First Published:  7 Oct 2023 5:26 AM GMT
Next Story