Telugu Global
Sports

భారత్- బంగ్లాదేశ్ తొలివన్డే నేడే!

వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా బంగ్లాదేశ్ తో ఈ రోజు ప్రారంభంకానున్న తీన్మార్ సిరీస్ లో భారత్ తలపడనుంది. మీర్ పూర్ స్టేడియం వేదికగా ఉదయం 11-30 గంటలకు తొలిపోరు ప్రారంభమవుతుంది.

భారత్- బంగ్లాదేశ్ తొలివన్డే నేడే!
X

భారత్- బంగ్లాదేశ్ తొలివన్డే నేడే!

వన్డే ప్రపంచకప్ కు సన్నాహాలలో భాగంగా బంగ్లాదేశ్ తో ఈ రోజు ప్రారంభంకానున్న తీన్మార్ సిరీస్ లో భారత్ తలపడనుంది. మీర్ పూర్ స్టేడియం వేదికగా ఉదయం 11-30 గంటలకు తొలిపోరు ప్రారంభమవుతుంది...

2022 క్రికెట్ సీజన్లో ఆఖరి విదేశీ సిరీస్ కు రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సిద్ధమయ్యింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ఢాకాలో అడుగుపెట్టింది.

పూర్తిస్థాయిజట్టుతో సమరం..

మరో 10 మాసాలలో భారత్ వేదికగా జరుగునున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు 4వ ర్యాంకర్, మాజీ చాంపియన్ భారత్ గత నెలలోనే సన్నాహాలు మొదలుపెట్టింది.

Advertisement

బంగ్లాగడ్డపై బంగ్లాదేశ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ కోసం ఢాకా చేరుకొంది.

మీర్ పూర్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే తొలివన్డేలో రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్, లిట్టన్ దాస్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ తమతమ పూర్తిస్థాయి జట్లతో పోటీకి దిగుతున్నాయి.

మందకొ్డిగా ఉండే స్వదేశీపిచ్ లపైన 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ కు అత్యంత ప్రమాదకరమైనజట్టుగా పేరుంది. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గాయంతో అందుబాటులో లేకపోడంతో..లిట్టన్ దాస్ తాత్కాలిక కెప్టెన్ గా భారత్ కు సవాలు విసురుతోంది. సీనియర్ స్టార్లు ముష్ ఫికుర్ రహీం, షకీబుల్ హసన్, మహ్మదుల్లా, ముస్తాఫిజుర్ లతో పాటు..పలువురు ప్రతిభావంతులైన యువఆటగాళ్లతో బంగ్లాదేశ్ సమతూకంతో కనిపిస్తోంది.

Advertisement

విరాట్ వైపే అందరి చూపు..

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో శిఖర్ ధావన్, విరాట్ కొహ్లీ, కెఎల్ రాహుల్ లాంటి సీనియర్ దిగ్గజాలున్నారు. వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కు ఈ సిరీస్ చావో బతుకో అన్నట్లుగా తయారయ్యింది. గత 10 ఇన్నింగ్స్ లో 9 వైఫల్యాలు చవిచూసిన పంత్ స్థానంలో సంజు శాంసన్ కు జట్టులో చోటు కల్పించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో రిషభ్ పంత్ తీవ్రవత్తిడి నడుమ బరిలోకి దిగుతున్నాడు.

ఇక..ఆస్ట్ర్రేలియా వేదికగా ముగిసిన టీ-20 ప్రపంచకప్ లో అసాధారణంగా రాణించిన మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ పైనే ఇప్పుడు అందరి చూపు కేంద్రీకృతమై ఉంది. విరాట్ మరో 30 పరుగులు చేయగలిగితే..బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోగలుగుతాడు. బంగ్లాపైన విరాట్ కు 80.83 సగటు ఉంది. ప్రస్తుత సీజన్లో విరాట్ ఆడిన గత ఎనిమిది వన్డేలలో 21.87 సగటు మాత్రమే సాధించాడు. అయితే..ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ తనదైన శైలిలో రాణిస్తే బంగ్లా బౌలర్లకు కష్టాలు తప్పవు.

కెప్టెన్ రోహిత్ శర్మ, రాహుల్ సైతం భారీస్కోరుకు గురిపెట్టారు.

మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. బౌలింగ్ విభాగంలో దీపక్ చహార్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ప్రధానపాత్ర వహించబోతున్నారు. మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు తుదిజట్టులో చోటు దక్కినా ఆశ్చర్యపోనక్కరలేదు. పరుగుల వెల్లువ ఖాయం..

మీర్ పూర్ లోని షేరే బంగ్లా నేషనల్ స్టేడియం స్లోబౌలర్లకు అనువుగా ఉండడంతో..భారీస్కోర్లు నమోదు కావడం ఖాయమని భావిస్తున్నారు. 300కు పైగా స్కోర్లు సునాయాసమని క్యూరేటర్ అంటున్నారు. 2016 సిరీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి తర్వాత నుంచి బంగ్లాదేశ్ స్వదేశీ సిరీస్ ల్లో ఓటమి అన్నదే లేకుండా విజయాలు సాధిస్తూ వస్తోంది. పైగా బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ 2022 సీజన్లో ఆడిన వన్డేలలో 500కు పైగా పరుగులతో కళ్లు చెదిరే ఫామ్ లో ఉండటం కూడా ఆతిథ్యజట్టుకు కలిసొచ్చే అంశం. భారత్ దే పైచేయి... 1988 నుంచి బంగ్లాదేశ్ ప్రత్యర్థిగా ఆడిన వన్డేమ్యాచ్ ల్లో భారత్ కేవలం 5 పరాజయాలు మాత్రమే చవిచూసింది. 2015 లో భారత్ పై చివరిసారిగా వన్డే మ్యాచ్ నెగ్గిన బంగ్లాదేశ్ కు ఆ తర్వాత నుంచి అన్నీ పరాజయాలే కావడం విశేషం. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 11-30 గంటలకు ప్రారంభమయ్యే ఈ తొలిపోరులో 4వ ర్యాంకర్ భారత్ హాట్ ఫేవరెట్ గాను, 7వ ర్యాంకర్ బంగ్లాదేశ్ డార్క్ హార్స్ గాను పోటీకి దిగుతున్నాయి.

Next Story