Telugu Global
Sports

ఢాకా నుండి చిట్టగాంగ్‌కు మారిన భార‌త్‌- బంగ్లా మూడో వ‌న్డే

బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల నుండి బంగ్లాదేశ్‌లో BNP అనేక భారీ ప్రదర్శనలు నిర్వహించింది.

ఢాకా నుండి చిట్టగాంగ్‌కు మారిన భార‌త్‌- బంగ్లా మూడో వ‌న్డే
X

బంగ్లాదేశ్‌లో రాజ‌కీయ అల్ల‌ర్ల నేప‌థ్యంలో ఢాకాలో నిర్వహించ త‌ల‌పెట్టిన మూడో వ‌న్డే మ్యాచ్‌ను చిట్ట‌గాంగ్‌కు మార్చారు. డిసెంబర్ 4 నుంచి బంగ్లా టైగర్స్‌తో భారత్ మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వాస్తవానికి, మూడో వన్డే మ్యాచ్‌ ఢాకాలో జరగాల్సి ఉంది. బంగ్లాదేశ్ -భారత్‌తో డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్‌లో, డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఢాకాలో రెండు టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల నుండి బంగ్లాదేశ్‌లో BNP అనేక భారీ ప్రదర్శనలు నిర్వహించింది.

డిసెంబ‌ర్ 10న వేల మందితో ఢాకా వీధుల్లో ర్యాలీ చేప‌ట్టాల‌ని బంగ్లాదేశ్ నేష‌న‌లిస్ట్ పార్టీ ( BNP) పిలుపునిచ్చింది. ఈ ప‌రిస్థితుల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వ‌చ్చే ర‌హ‌దారుల‌న్నీమూసివేసే అవకాశం ఉన్నందున, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత్‌తో జ‌రిగే మూడో వ‌న్డే మ్యాచ్ వేదిక‌ను ఢాకా నుండి చిట్టగాంగ్‌కు తరలించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఆపరేషన్స్ చీఫ్ జలాల్ యూనస్ తెలిపారు. డిసెంబర్ 10న జరగనున్న సిరీస్‌లోని మూడో మ్యాచ్ ఇప్పుడు తీరప్రాంత నగరమైన చిట్టగాంగ్‌కు మార్చారు.

అయితే ఇంత ఆల‌స్యంగా వేదిక మార్పున‌కు గ‌ల కార‌ణాల‌పై స్పందించేందుకు జ‌లాల్ నిరాక‌రించారు. ర్యాలీని క‌ట్ట‌డిచేసే ప్ర‌య‌త్నంలో భాగాంగానే బంగ్లాదేశ్ క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని బోర్డు అధికారిని ఉటంకిస్తూ 'న్యూ ఏజ్' వార్తాపత్రిక వెల్లడించింది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్‌లో, డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఢాకాలో రెండు టెస్టులకు బంగ్లాదేశ్ భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

First Published:  23 Nov 2022 1:21 PM GMT
Next Story