Telugu Global
Sports

ఆసియా క‌ప్‌లో మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్న‌ భార‌త్‌, పాక్‌

పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ సాధించింది. దీంతో గ్రూప్-Aలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆసియా కప్ 2022లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇదే చివరి మ్యాచ్ కాదు. రెండు జట్లూ ఒక వారంలో మరోసారి తలపడే ఛాన్స్ ఉంది.

ఆసియా క‌ప్‌లో మ‌రోసారి త‌ల‌ప‌డ‌నున్న‌ భార‌త్‌, పాక్‌
X

ఆసియా క‌ప్‌లో భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య ఆదివారం ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన పోరులో భార‌త్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విష‌యం తెలిసిందే.. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ పై ఎంతో ఆస‌క్తిగా చూపింది. మైదానంలో పోటీ కూడా అదే విధంగా హై వోల్టేజీలా మారిన సంగతి తెలిసిందే. చివ‌రి ఓవ‌ర్ల‌లో హార్ధిక్ పాండ్యా వీరోచిత ప్ర‌ద‌ర్శ‌న‌తో రెండు బంతులు మిగిలుండ‌గానే విజ‌యం భార‌త్ వ‌శ‌మైంది.

పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ సాధించింది. దీంతో గ్రూప్-Aలో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆసియా కప్ 2022లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇదే చివరి మ్యాచ్ కాదు. రెండు జట్లూ ఒక వారంలో మరోసారి తలపడే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్‌ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మరోసారి పాకిస్తాన్‌తో పోటీ ప‌డాల్సి ఉంటుంది.


సూప‌ర్‌-4 లో టాప్-2 జ‌ట్లుగా..

పాకిస్తాన్, హాంకాంగ్ జట్లు భారత్‌తో గ్రూప్ - Aలో ఉన్నాయి. గ్రూప్ A, B రెండింటి నుంచి టాప్ 2 జట్లు సెప్టెంబర్ 3 నుంచి జరిగే సూపర్ 4లోకి ప్రవేశిస్తాయి. సెప్టెంబర్ 4న అంటే వచ్చే ఆదివారం, గ్రూప్ Aలోని టాప్ 2 జట్లు మరోసారి తలపడతాయి. అంటే భారత్, పాక్ జట్లు ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. రెండు జట్లు తమ తదుపరి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించగానే, మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైనట్టే. హాంకాంగ్ తన రెండు మ్యాచ్‌లలో ఏదైనా ఒకదానిని గెలిస్తే, టాప్ 2 జట్లలో ఒకదానికి ఇబ్బంది ఉంటుంది. మ్యాటర్ నెట్ రన్ రేట్‌కు చేరుకుంటుంది. భారత్ పటిష్ట స్థితిలో ఉంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్ రేట్ 0.175 కాగా, పాకిస్తాన్ నెట్ రన్ రేట్ -0.175.


బ‌దులు తీర్చుకున్న భార‌త్‌...

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ ఓడించడం ద్వారా భారత్ తన ప్ర‌యాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది. దీంతో పాటు మునుపటి ఓటమి ఖాతాను కూడా సమం చేసింది. టీ20 ప్రపంచకప్ 2021లో చివరిసారిగా ఇరు జట్లు ముఖాముఖి తలపడగా, ఇదే మైదానంలో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా పాత లెక్కలు సమం చేసింది. త‌ర్వాతి పోరుకూ సై అంటోంది. మ‌రోప‌క్క చివ‌ర్లో ఊరించి ఉసూరుమ‌నిపించిన తొలి మ్యాచ్ కి ప్ర‌తీకారం రెండో మ్యాచ్‌లో తీర్చుకునేందుకు పాకిస్తాన్ కూడా ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

First Published:  29 Aug 2022 10:05 AM GMT
Next Story