Telugu Global
Sports

వానదెబ్బతో ఆఖరి టీ-20 టై- భారత్ కే సిరీస్!

భారత్- న్యూజిలాండ్ జట్ల మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు వరుణదేవుడు తనదైన ముగింపునిచ్చాడు. హామిల్టన్ వేదికగా జరగాల్సిన తొలిటీ-20 వానదెబ్బతో రద్దుల పద్దులో చేరింది. బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ 65 పరుగుల భారీవిజయంతో నెగ్గడం ద్వారా 1-0తో పైచేయి సాధించింది.

వానదెబ్బతో ఆఖరి టీ-20 టై- భారత్ కే సిరీస్!
X

వానదెబ్బతో ఆఖరి టీ-20 టై- భారత్ కే సిరీస్!

న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 సిరీస్ ను భారత్ 2-0తో గెలుచుకొంది. నేపియర్ వేదికగా జరిగిన ఆఖరిమ్యాచ్ వానదెబ్బతో అర్థంతరంగా ముగియడంతో..రెండో టీ-20 నెగ్గిన భారత్ విజేతగా నిలిచింది...

భారత్- న్యూజిలాండ్ జట్ల మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు వరుణదేవుడు తనదైన ముగింపునిచ్చాడు. హామిల్టన్ వేదికగా జరగాల్సిన తొలిటీ-20 వానదెబ్బతో రద్దుల పద్దులో చేరింది. బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో టీ-20లో భారత్ 65 పరుగుల భారీవిజయంతో నెగ్గడం ద్వారా 1-0తో పైచేయి సాధించింది. ఈ నేపథ్యంలో నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా జరిగిన ఆఖరి టీ-20లో 28 ఓవర్ల మేరకు మాత్రమే ఆట సాధ్యపడింది.

సిరాజ్, అర్షదీప్ షో...

సిరీస్ కే కీలకంగా మారిన ఈ ఆఖరాటలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగుల స్కోరుకే పరిమితమయ్యింది. ఓపెనర్ కాన్వే, రెండోడౌన్ గ్లెన్ ఫిలిప్ ఫైటింగ్ హాఫ్ సెంచరీలు సాధించడంతో కివీజట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

భారత పేసర్లు హర్షదీప్ సింగ్ 37 పరుగులిచ్చి 4 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి కివీలను కట్టడి చేశారు.

సూర్య 13 పరుగులకే అవుట్....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 161 పరుగులు చేయాల్సిన భారత్...వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 9 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. కెప్టెన్ హార్థిక్ పాండ్యా 30 పరుగులతో నాటౌట్ గా నిలువగా...ఓపెనర్లు ఇషాన్ కిషన్ 10, రిషభ్ పంత్ 11 పరుగులు, సూర్యకుమార్ 13, శ్రేయస్ అయ్యర్ డకౌట్ గా వెనుదిరిగారు.

మిస్టర్ టీ-20 సూర్యకుమార్ 10 బంతుల్లో ఓ బౌండ్రీ, ఓ సిక్సర్ తో లెగ్ స్పిన్నర్ ఇష్ సోథీ బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్ పట్టిన క్యాచ్ కు దొరికిపోయాడు.

డక్ వర్త్ -లూయిస్ లోనూ టై...

వర్షంతో అర్థంతరంగా మ్యాచ్ లు ముగిసిన సమయంలో విజేతను నిర్ణయించడానికి డక్ వర్త్- లూయిస్ విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. అయితే.. న్యూజిలాండ్, భారత్ జట్లు మొదటి 9 ఓవర్లలో నష్టపోయిన వికెట్లు, సాధించిన పరుగులు సమంగా ఉండడంతో...మ్యాచ్ టైగా ముగించినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రెండో టీ-20లో విజేతగా నిలిచిన భారతజట్టును సిరీస్ నెగ్గినట్లుగా మ్యాచ్ రిఫరీ నిర్ణయించారు. టీ-20 క్రికెట్ చరిత్రలో డక్ వర్త్ -లూయిస్ పద్దతిలో టైగా ముగిసిన మూడో మ్యాచ్ గా భారత్- న్యూజిలాండ్ జట్ల సమరం రికార్డుల్లో చేరింది.

ఇంతకుముందు నెదర్లాండ్స్- మలేసియా, మాల్టా- జిబ్రాల్టర్ జట్ల మ్యాచ్ లు టైగా ముగిసిన మ్యాచ్ లుగా ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, మహ్మద్ సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు దక్కాయి.

మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలివన్డే అక్లాండ్ వేదికగా గురువారం ప్రారంభమవుతుంది. భారత వన్డేజట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు.

First Published:  22 Nov 2022 1:00 PM GMT
Next Story