Telugu Global
Sports

బంగ్లాతో తొలిటెస్టులో భారత్ పట్టు!

బంగ్లాదేశ్ తో తొలిటెస్టు రెండోరోజు ఆటలోనే భారత్ పైచేయి సాధించింది. లోయర్ ఆర్డర్ జోడీ అశ్విన్- కుల్దీప్ 8వ వికెట్ కు కీలక భాగస్వామ్యం నమోదు చేయడంతో 404 పరుగుల స్కోరు సాధించగలిగింది.

బంగ్లాతో తొలిటెస్టులో భారత్ పట్టు!
X

బంగ్లాదేశ్ తో తొలిటెస్టు రెండోరోజు ఆటలోనే భారత్ పైచేయి సాధించింది. లోయర్ ఆర్డర్ జోడీ అశ్విన్- కుల్దీప్ 8వ వికెట్ కు కీలక భాగస్వామ్యం నమోదు చేయడంతో 404 పరుగుల స్కోరు సాధించగలిగింది..

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టు రెండోరోజుఆటలోనే భారత్ పైచేయి సాధించింది. లోయర్ ఆర్డర్ జోడీ రవిచంద్రన్ అశ్విన్- కుల్దీప్ యాదవ్ 8వ వికెట్ కు 92 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ 404 పరుగుల లక్ష్యాన్ని చేరుకోగలిగింది.

ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజుఆట ప్రారంభించిన భారత్ కు 8వ వికెట్ జోడీ అశ్విన్- కుల్దీప్ చక్కటి భాగస్వామ్యంతో పునాదిని పటిష్టం చేశారు.తొలిరోజుఆటలో టాపార్డర్

బ్యాటర్లు చతేశ్వర్ పూజారా ( 90 పరుగులు ), శ్రేయస్ అయ్యర్ ( 86 పరుగులు ) కీలక హాఫ్ సెంచరీలు సాధిస్తే..రెండోరోజుఆటలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అశ్విన్, కుల్దీప్ తమవంతుగా ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడారు.

అశ్విన్ 13వ హాఫ్ సెంచరీ..

భారత స్పిన్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటుతోనూ మెరిశాడు. కుల్దీప్ యాదవ్ అండగా నిలవడంతో బంగ్లా బౌలర్లను నిలువరించాడు. 8వ వికెట్ కు 92 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు.

అశ్విన్ మొత్తం 113 బంతులు ఎదుర్కొని 2 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 58 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. టెస్టు క్రికెట్లో అశ్విన్ కు ఇది 13వ హాఫ్ సెంచరీ. మరోవైపు కుల్దీప్ యాదవ్ సైతం ఎనలేని ఓర్పుతో ఆడి 114 బంతుల్లో 5 బౌండ్రీలతో 40 పరుగుల స్కోరుకు వెనుదిరిగాడు.

టెయిల్ ఎండర్లు ఉమేశ్ 15 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలువగా..,సిరాజ్ 4 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. భారత్ మొత్తం 133.5 ఓవర్లు ఆడి 404 పరుగుల స్కోరుకు ఆలౌటయ్యింది.

బంగ్లా బౌలర్లలో తైజుల్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.

రెండోరోజుఆట భోజన విరామం తర్వాత తన తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాను భారత ఓపెనింగ్ బౌలర్లు సిరాజ్, ఉమేశ్ దెబ్బ మీద దెబ్బ కొట్టారు. ఓపెనర్ నజుమల్ హసన్ సాంటోను సిరాజ్..డకౌట్ గా పడగొట్టాడు.

వన్ డౌన్ ఆటగాడు యాసిర్ అలీని 4 పరుగుల స్కోరుకే ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లాజట్టు 6 పరుగులకే 2 టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

First Published:  15 Dec 2022 9:16 AM GMT
Next Story