Telugu Global
Sports

ఆంధ్ర వికెట్ కీపర్ భరత్ కు భలే చాన్స్!

తెలుగు రాష్ట్ర్ర్రాల మరో క్రికెటర్ భారత టెస్టు జట్టులో సభ్యుడిగా అరంగేట్రం చేయటానికి తహతహలాడుతున్నాడు. నాగపూర్ టెస్టు ద్వారా ఆంధ్ర క్రికెటర్ కెఎస్ భరత్ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోనున్నాడు.

ఆంధ్ర వికెట్ కీపర్ భరత్ కు భలే చాన్స్!
X

ఆంధ్ర వికెట్ కీపర్ భరత్ కు భలే చాన్స్!

తెలుగు రాష్ట్ర్ర్రాల మరో క్రికెటర్ భారత టెస్టు జట్టులో సభ్యుడిగా అరంగేట్రం చేయటానికి తహతహలాడుతున్నాడు. నాగపూర్ టెస్టు ద్వారా ఆంధ్ర క్రికెటర్ కెఎస్ భరత్ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోనున్నాడు..

క్రికెట్ బరిలోకి దిగిన ప్రతిఆటగాడికీ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా జాతీయజట్టుకు..అదీ టెస్టు క్రికెటర్ గా ఆడాలని కలలు కనటం సర్వసాధారణం. దేశంలో వందలాదిమంది క్రికెటర్లుంటే..భారతటెస్టు జట్టుకు ఆడే అరుదైన అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. అలాంటి అరుదైన అవకాశం మన తెలుగు క్రికెటర్, ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ కెఎస్ భరత్ కు దక్కింది.

రిషభ్ పంత్ గాయం..భరత్ కు వరం..

భారత నంబర్ వన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి జట్టుకు దూరం కావడంతో..ఆ స్థానం కోసం ఆంధ్ర ఆటగాడు కెఎస్ భరత్, జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ పోటీపడుతున్నారు.

ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల ఐసీసీ టెస్టులీగ్ సమరంలో భారతజట్టు సరికొత్త వికెట్ కీపర్ బ్యాటర్ తో బరిలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. నాగపూర్ టెస్టుతో నాలుగుమ్యాచ్ ల సిరీస్ ప్రారంభంకానుంది.

అయితే..స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కీలకం కావడంతో..భరత్ వైపే భారత టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపటం ఖాయంగా కనిపిస్తోంది. వైట్ బాల్ క్రికెట్లో సత్తా చాటుకొన్న ఇషాన్ కిషన్ కు రెడ్ బాల్ క్రికెట్లో అంతంత మాత్రం రికార్డు, అనుభవం మాత్రమే ఉన్నాయి.

ఇషాన్ తో పోల్చుకొంటే భరత్ కే మెరుగైన వికెట్ కీపర్ గా గుర్తింపు ఉంది. గత కొద్ది సంవత్సరాలుగా భారత రెండో వికెట్ కీపర్ బ్యాటర్ గా శిక్షణ పొందుతున్న భరత్ నాగపూర్ టెస్టు ద్వారా అరంగేట్రానికి సిద్ధమయ్యాడు.

అప్పుడు ఎమ్మెస్కే- ఇప్పుడు భరత్...

ఆంధ్ర క్రికెట్ నుంచి భారత టెస్టుజట్టులో ఇప్పటి వరకూ ఎమ్మెస్కే ప్రసాద్, హనుమ విహారీ మాత్రమే చోటు సంపాదించగలిగారు. ఇప్పుడు కెఎస్ భరత్ వారిసరసన నిలువబోతున్నాడు.

గతంలో భారత టెస్టు జట్టుకు ఎమ్మెస్కే ప్రసాద్ వికెట్ కీపర్ బ్యాటర్ గా సేవలు అందించాడు. అదే ఘనతను 29 సంవత్సరాల భరత్ దక్కించుకోనున్నాడు. ఆంధ్ర, ఇండియా- ఏ జట్ల తరపున తన కెరియర్ లో 86 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన భరత్ కు 4వేల 707 పరుగులు, 9 శతకాలు, 27 అర్థశతకాలు సాధించిన రికార్డు ఉంది.

అత్యధికంగా 308 పరుగుల స్కోరు నమోదు చేశాడు. వికెట్ కీపర్ గా 296 క్యాచ్ లు, 35 స్టంపింగ్స్ రికార్డు సైతం ఉంది.

ప్రస్తుత ఆస్ట్ర్రేలియా సిరీస్ ద్వారా అందివచ్చిన ఈ అవకాశాన్ని భరత్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని భారతజట్టులో తన చోటును పదిలం చేసుకోవాలని, తెలుగు రాష్ట్ర్రాలకు..ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు గర్వకారణంగా నిలవాలని కోరుకొందాం!

First Published:  9 Feb 2023 6:24 AM GMT
Next Story