Telugu Global
Sports

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, ఇంగ్లండ్

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ కు చిరకాల ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లండ్ దూసుకెళ్లాయి. ప్రీ-క్వార్టర్ ఫైనల్ నాకౌట్ రౌండ్లలో తిరుగులేని విజయాలు సాధించాయి.

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, ఇంగ్లండ్
X

ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ కు చిరకాల ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లండ్ దూసుకెళ్లాయి. ప్రీ-క్వార్టర్ ఫైనల్ నాకౌట్ రౌండ్లలో తిరుగులేని విజయాలు సాధించాయి.

ప్రపంచకప్ ఫుట్ బాల్ క్వార్టర్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, మాజీ చాంపియన్లు ఇంగ్లండ్, అర్జెంటీనా చేరుకొన్నాయి. ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నాకౌట్ రౌండ్లలో

ఈ మూడు మేటిజట్లూ తమదైన శైలిలో విజయాలతో టైటిల్ రౌండ్ కు మరింత చేరువయ్యాయి.

ఫ్రాన్స్ టాప్ గేర్...

ప్రపంచకప్ హాట్ ఫేవరెట్, డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ జట్టు క్వార్టర్ ఫైనల్ నాకౌట్ రౌండ్ కు అలవోకగా చేరుకొంది. ఖతర్ రాజధాని దోహా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ నాలుగో ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3-1 గోల్స్ తో పోలెండ్ ను చిత్తు చేసింది.

పోటీ ప్రారంభం నుంచి ఫ్రెంచ్ ఆధిపత్యమే కొనసాగిన ఈ పోరులో ఆలీవర్ గిరౌడ్, స్టార్ స్ట్ర్రయికర్ కిల్యాన్ ఎంబప్పేల జోరుకు అడ్డలేకపోయింది. ఆట మొదటి భాగంలోనే ఎంబప్పే అందించిన పాస్ ను గోలుగా మలచడం ద్వారా గిరౌడ్ తనజట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్ తరపున అంతర్జాతీయ ఫుట్ బాల్ లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. థియరీ హెన్రీ పేరుతో ఉన్న అత్యధిక గోల్ స్కోరర్ రికార్డును తెరమరుగు చేశాడు.

ఇక ..ఆట రెండోభాగంలో ఫ్రెంచ్ డైనమైట్ ఎంబప్పే మరింత దూకుడుగా ఆడి పోలెండ్ డిఫెన్స్ ను కకావికలు చేశాడు. ఫ్రాన్స్ వేగాన్ని అందుకోడంలో పోలిష్ డింపెండర్లు విఫలమయ్యారు. ఎంబప్పే వరుసగా రెండుగోల్సు చేయడంతో ఫ్రాన్స్ ఆధిక్యం ఆట 74వ నిముషానికే 3-0కు పెరిగిపోయింది. ఆట ముగిసే క్షణాలలో లభించిన పెనాల్టీని గోలుగా మలచడం ద్వారా పోలెండ్ కెప్టెన్ రాబర్ట్ లెవాండోవస్కీ కంటితుడుపు గోలు సాధించాడు.

క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ తో ఢీ..

గత 60 సంవత్సరాల కాలంలో ప్రపంచకప్ ను వరుసగా రెండుసార్లు గెలుచుకొన్న రెండోజట్టుగా నిలవాలన్న పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. క్వార్టర్ ఫైనల్స్ చేరడం ద్వారా టైటిల్ కు మరింత చేరువయ్యింది. సెమీఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్ తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.

మరో ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్రికా చాంపియన్ సెనెగల్ ను ఇంగ్లండ్ చిత్తు చేసింది.

సెనెగల్ కు ఇంగ్లండ్ కిక్...

ఖతర్ లోని అల్ బైట్ స్టేడియం వేదికగా జరిగిన మూడో ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంగ్లండ్ 3-0 గోల్స్ తో ఆఫ్రికా చాంపియన్ సెనెగల్ ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ రౌండ్ కు చేరుకొంది.

ఇంగ్లండ్ షోగా సాగిన ఈ పోరులో 19 సంవత్సరాల జూడే బెల్లింగ్ హామ్ అసాధారణ ప్రతిభతో మూడోగోల్స్ విజయం నమోదు చేసింది. ఆట మొదటి భాగానికే ఇంగ్లండ్ రెండుగోల్స్ తో 2-0తో పైచేయి సాధించి్ంది. జోర్డాన్ హెండర్సన్, హారీ కానే చెరోగోల్ సాధించారు. ఆట రెండో భాగంలో బుకాయో సాకా మూడోగోల్ తో ఇంగ్లండ్ విజయం పూర్తి చేశాడు.

ఇంగ్లండ్ తరపున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన గారీ లినేకర్ రికార్డును కానే సమం చేయగలిగాడు. కానే 11 గోల్స్ తో గారీ సరసన నిలిచాడు.

ప్రస్తుత ప్రపంచకప్ నాకౌట్ దశలో ఓ గోల్ సాధించడంలో తోడ్పడిన టీనేజర్ గా బెల్లింగ్ హామ్ రికార్డుల్లో చేరాడు.

56 సంవత్సరాల క్రితం తన ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన ఇంగ్లండ్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలంటే క్వార్టర్ ఫైనల్లో ప్రాన్స్ ను అధిగమించాల్సి ఉంది.

ప్రీ-క్వార్టర్స్ లో మెస్సీ మ్యాజిక్...

ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ కు మరో మాజీ చాంపియన్ అర్జెంటీనా సైతం చేరుకొంది. ప్రీ- క్వార్టర్ ఫైనల్ రౌండ్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తో ఆస్ట్ర్ర్లేలియాను అధిగమించింది.

తన కెరియర్ లో 1000వ అంతర్జాతీయమ్యాచ్ ఆడిన అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ తనజట్టు తరపున తొలిగోల్ సాధించడం ద్వారా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ఇప్పటి వరకూ గ్రూప్ లీగ్ దశలోనే గోల్స్ సాధించిన మెస్సీ..ఎట్టకేలకు నాకౌట్ రౌండ్ లో సైతం తన తొలిగోల్ నమోదు చేయగలిగాడు. ఆట ప్రారంభంలోనే మెస్సీ గోల్ చేయడం ద్వారా తనజట్టుకు 1-0 ఆధిక్యం అందించాడు. మెస్సీ కెరియర్ లో ఇది 789 గోల్ గా నమోదయ్యింది. ఆట 57వ నిముషంలో జూలియన్ అల్వారెజ్ అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.

ఆట 77వ నిముషంలో ఎంజో ఫెర్నాండేజ్ సెల్ఫ్ గోల్ తో ఆస్ట్ర్రేలియాకు గోల్ దక్కింది. రెండుసార్లు విజేత అర్జెంటీనా 2-1 గోల్స్ తో విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో చోటు కోసం నెదర్లాండ్స్ తో అర్జెంటీనా పోటీపడుతుంది.

First Published:  5 Dec 2022 3:14 AM GMT
Next Story