Telugu Global
Sports

రిషభ్ పంత్ కోసం భారత క్రికెటర్ల పూజలు!

కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యుకోరల నుంచి బయట పడి, పలు శస్త్రచికిత్సల తర్వాత తేరుకొన్న భారత యువవికెట్ కీపర్ రిషభ్ పంత్ కు స్వస్థత చేకూరాలని కోరుతూ భారత క్రికెటర్లు దేవుళ్ళను వేడుకొంటున్నారు.

రిషభ్ పంత్ కోసం భారత క్రికెటర్ల పూజలు!
X

కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఉజ్జయినీ మహాకాళేశ్వర్ ఆలయంలో భారత క్రికెటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు...

కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యుకోరల నుంచి బయట పడి, పలు శస్త్రచికిత్సల తర్వాత తేరుకొన్న భారత యువవికెట్ కీపర్ రిషభ్ పంత్ కు స్వస్థత చేకూరాలని కోరుతూ భారత క్రికెటర్లు దేవుళ్ళను వేడుకొంటున్నారు.

న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా మంగళవారం జరిగే ఆఖరివన్డేలో పాల్గొనటానికి ఇండోర్ చేరుకొన్న భారతజట్టు సభ్యులు ..సమీపంలోని ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించారు.

భస్మ హారతితో పూజలు..

ఉజ్జయినీ మహాకాళేశ్వరునికి తెల్లవారు జామున నిర్వహించే భస్మహారతి విశేష పూజాకార్యక్రమంలో భారత క్రికెటర్లు సాంప్రదాయ దోతీ, అంగవస్త్రాలు ధరించి పాల్గొన్నారు.

తమ సహఆటగాడు రిషభ్ పంత్ త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని తాము మహాకాళేశ్వరుని వేడుకొన్నామని భారత స్టార్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

భారతజట్టుకు రిషభ్ పంత్ ఎంతో కీలకమైన ఆటగాడని, అతని అవసరం ఎంతో ఉందని సూర్య గుర్తు చేశాడు.

సూర్యకుమార్ తో పాటు కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తో పాటు టీమిండియా సహాయక బృందం సభ్యులు సైతం ఈ పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉజ్జయినీకి 50 కిలోమీటర్ల దూరంలోని ఇండోర్ లో విడిది చేసిన భారతజట్టు మంగళవారం హోల్కార్ స్టేడియం వేదికగా జరిగే ఆఖరి వన్డేమ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

ఇప్పటికీ సిరీస్ లోని మొదటిరెండువన్డేలు నెగ్గడం ద్వారా సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్..ఇండోర్ వన్డేలో సైతం విజయం సాధించి క్లీన్ స్వీప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది.

హైస్కోరింగ్ స్కోర్ల గ్రౌండ్ గా పేరున్న ఇండోర్ స్టేడియంలో బౌండ్రీల నిడివి చాలా తక్కువగా ఉండటంతో బౌండ్రీలు, సిక్సర్ల మోత మోగటం ఆనవాయితీగా వస్తోంది.

ఇదే గ్రౌండ్ వేదికగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన ఘనత ఇండోర్ హోల్కార్ స్టేడియానికి ఉంది.



First Published:  23 Jan 2023 9:27 AM GMT
Next Story