Telugu Global
Sports

మహిళా ప్రపంచకప్ పుట్ బాల్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్!

2023 మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్స్ కు డార్క్ హార్స్ స్పెయిన్, హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ చేరుకొన్నాయి. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ సమరంలో తలపడనున్నాయి.

మహిళా ప్రపంచకప్ పుట్ బాల్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్!
X

2023 మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ ఫైనల్స్ కు డార్క్ హార్స్ స్పెయిన్, హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ చేరుకొన్నాయి. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగే టైటిల్ సమరంలో తలపడనున్నాయి......

ట్రాన్స్ టాస్మన్ దేశాలు ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2023 ఫిఫా మహిళా ప్రపంచకప్ ఫుట్ బాల్ లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ సంచలనం వెంట సంచలనం నమోదవుతూ వస్తున్నాయి.

న్యూజిలాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా స్పెయిన్- స్వీడన్ జట్ల తొలి సెమీఫైనల్ హోరాహోరీగా సాగితే...ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా జట్ల రెండో సెమీఫైనల్ ఏకపక్షంగా ముగిసింది. కొద్దిసేపటి క్రితమే ముగిసిన రెండోసెమీస్ పోరులో ఇంగ్లండ్ చేతిలో 1-3 ఓటమితో ఆతిథ్య ఆస్ట్ర్రేలియా టైటిల్ వేటకు తెరపడినట్లయ్యింది.

స్వీడన్ కు స్పెయిన్ షాక్....

భారీ అంచనాల మధ్య సాగిన తొలి సెమీఫైనల్లో డార్క్ హార్స్ స్పెయిన్ 2-1 తో పవర్ ఫుల్ స్వీడన్ పై సంచలన విజయం సాధించింది. ఆట మొదటి భాగంలో ఏ జట్టూ గోలు సాధించలేకపోడంతో 0-0తో ముగిసింది.

అయితే...ఆట రెండోభాగం చివర్లో రెండుజట్లూ కలసి వెంట వెంటనే మూడుగోల్స్ చేయడం ద్వారా మ్యాచ్ కు మెరుపువేగంతో ముగింపు నిచ్చాయి. ఆట మొదటి భాగం 45 నిముషాలలో బంతిని ఎక్కువ భాగం స్పెయిన్ జట్టే తన అదుపులో ఉంచుకోగలిగింది.

స్పెయిన్ యువప్లేయర్ సాల్మా పార్లులేలా తొలిగోల్ తో స్పెయిన్ 1-0తో పైచేయి సాధించింది.

స్వీడన్ తరపున రెబెక్కా బ్లోమ్ క్విస్ట్ ఈక్వలైజర్ గోలు సాధించడంతో పోరు 1-1తో రసవత్తరంగా మారింది. ఆట ముగిసే క్షణాలలో స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కార్మోనా 89 నిముషంలో మెరుపు గోలు సాధించడంతో స్పెయిన్ 2-1తో తొలిసారిగా మహిళా ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకోగలిగింది. సెమీస్ కు ముందు వరకూ స్పెయిన్ సాధించిన మొత్తం 11 గోల్సులో 7 గోల్స్ సెట్- పీసెస్ వ్యూహంతో సాధించగలిగింది.

క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్, సెమీఫైనల్లో స్వీడన్ జట్లను కంగు తినిపించిన స్పెయిన్ ఆదివారం సిడ్నీ వేదికగా జరిగే టైటిల్ సమరంలో పవర్ ఫుల్ ఇంగ్లండ్ ను ఢీ కోనుంది.

సెమీస్ లో స్వీడన్ నాలుగోసారి బోల్తా...

ప్రపంచ మహిళా ఫుట్ బాల్ అత్యుత్తమ జట్లలో ఒకటైన స్వీడన్ ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ గా ఉంది. వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ సెమీస్ చేరుకొన్న జట్టు ఘనతను సైతం సొంతం చేసుకోగలిగింది. మొత్తం మీద నాలుగుసార్లు సెమీస్ చేరినా... ఫైనల్స్ మాత్రం చేరుకోలేకపోయింది.

ఈ మ్యాచ్ కు రికార్డుస్థాయిలో 43వేల 217 మంది హాజరు కావడం విశేషం.

ఆస్ట్ర్రేలియాకు ఇంగ్లండ్ కిక్....

ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్ 3-1 గోల్స్ తో ఆతిథ్యజట్టును చిత్తు చేసింది. ఆట 36వ నిముషంలోనే టో్నీ ఎల్లా తొలిగోల్ తో ఇంగ్లండ్ కు 1-0 తో పైచేయి సాధించిపెట్టింది.

మొదటి భాగం ముగిసే సమయానికే 1-0తో ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ రెండో భాగంలో మరో రెండుగోల్స్ చేయగా..ఆస్ట్రేలియా ఒక్క గోలుతో సరిపెట్టుకొంది. ఆట రెండో భాగం 63 నిముషంలో కంగారూ స్టార్ ప్లేయర్ సామ్ కెర్ గోల్ తో ఆస్ట్ర్రేలియా 1-1తో సమఉజ్జీగా నిలిచింది.

అయితే..71వ నిముషంలో లారెన్ హెంప్, 86వ నిముషంలో రుస్సో అలీసియా చెరో గోలు సాధించడంతో ఇంగ్లండ్ 3-1 గోల్స్ విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది.

సిడ్నీ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో ఏ జట్టు నెగ్గినా తొలిసారిగా ప్రపంచ చాంపియన్ ట్రోఫీ అందుకోగలుగుతుంది.

First Published:  16 Aug 2023 10:15 AM GMT
Next Story