Telugu Global
Sports

ఫుట్‌బాల్ ఆటగాళ్లు మైదానంలో ఎందుకు ఉమ్మి వేస్తారో తెలుసా..?

ఫుట్‌బాల్ ఆటగాళ్ళు, క్రికెటర్లు, రగ్బీ ఆటగాళ్ళు గ్రౌండ్‌లో ఉమ్మివేయడానికి అనుమతిస్తారు. టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడే వారికి మాత్రం జరిమానా విధిస్తారు.

ఫుట్‌బాల్ ఆటగాళ్లు మైదానంలో ఎందుకు ఉమ్మి వేస్తారో తెలుసా..?
X

ఫిఫా ప్రపంచ కప్ 2022 ఇప్పుడే ప్రారంభమైంది. మీరు ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు చూసినట్లయితే, ఆటగాళ్ళు ఆడుతున్నప్పుడు మైదానంలో ఉమ్మివేయడం మీకు కనిపించి ఉండవచ్చు. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? సైన్స్‌లో దానికి ఓ భిన్నమైన వివరణ ఉంది. అదేంటో తెలుసుకుందాం.

కొన్ని అధ్యయనాల ప్రకారం, వ్యాయామం లాలాజలంలోకి స్రవించే ప్రొటీన్‌ మొత్తాన్ని పెంచుతుంది, ప్రత్యేకించి MUC5B అని పిలువబడే ఒక రకమైన శ్లేష్మం లాలాజలాన్ని మందంగా, మింగడానికి కష్టతరం చేస్తుంది.

ఫరీదాబాద్‌లోని ఏషియన్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఉదిత్ కపూర్ ఓ ఇంగ్లిష్ ప‌త్రిక‌తో మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల వంటి శారీరక శ్రమతో కూడిన కార్యకలాపాల సమయంలో నోటిలోని లాలాజలం చిక్కగా ఉంటుందని, ఆటగాళ్ళు ఉమ్మివేయడం మంచిదని భావిస్తారని చెప్పారు. "ముఖ్యంగా MUC5B అని పిలువబడే ఒక రకమైన శ్లేష్మం ఉంది, ఇది లాలాజలాన్ని మందంగా చేస్తుంది. మింగడం కష్టతరం చేస్తుంది. కాబట్టి, ఉమ్మివేయడం ఉత్తమం" అని ఆయ‌న వివ‌రించారు.

ఫుట్‌బాల్ ఆటగాళ్ళు, క్రికెటర్లు, రగ్బీ ఆటగాళ్ళు గ్రౌండ్‌లో ఉమ్మివేయడానికి అనుమతిస్తారు. టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడే వారికి మాత్రం జరిమానా విధిస్తారు. వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువ MUC5B ఎందుకు ఉత్పత్తి అవుతుందో స్పష్టంగా తెలియనప్పటికీ, వారు తమ నోటి ద్వారా ఎక్కువగా ఊపిరి పీల్చుకోవడం వల్ల కావచ్చునని, అందువల్ల శ్లేష్మం నోటిని ఎండిపోకుండా ఆపుతుందని తెలుస్తోంది.

కార్బ్ రిన్సింగ్ అంటే ఏమిటి..

ఫుట్‌బాల్ ఆటగాళ్ళు కార్బోహైడ్రేట్ ద్రావణంతో నోటిని కడిగి వాటిని ఉమ్మివేయడాన్ని కార్బ్ రిన్సింగ్ అంటారు. ఇది శరీరాన్ని, ప్రత్యేకించి మెదడును నిజంగా కార్బోహైడ్రేట్‌లను వినియోగిస్తున్నట్లు భావించేలా చేస్తుంది, ఆ కార్బోహైడ్రేట్‌లు ఉన్నట్లుగా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

ఒక వ్యాయామ శరీరధర్మ శాస్త్రవేత్త, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అయిన Asker Jeukendrup, కార్బ్ రిన్సింగ్ నిజానికి మెరుగైన పనితీరుతో ముడిపడి ఉంటుందని న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఆయ‌న‌ 2004లో బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంతో నిర్వహించిన ఒక అధ్యయనంలో, 40 కిలోమీటర్ల సైక్లింగ్ టైమ్ ట్రయల్స్‌లో కార్బ్-రిన్సింగ్.. సైక్లిస్ట్‌లను ఒక నిమిషం వేగంగా చేశాయని కనుగొన్నారు.

2017లో యూరోపియన్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్ సైన్స్‌లో ప్రచురించిన మరొక అధ్యయనం కార్బ్-రిన్సింగ్ మెరుగైన పనితీరును కనుగొంది. ఇందులో 20 ఏళ్ల వయస్సులో ఉన్న 12 మంది ఆరోగ్యవంతమైన పురుషులు పాల్గొన్నారు. వారు ఎత్తుకు దూకడం, ఎక్కువ బెంచ్ ప్రెస్‌లు, స్క్వాట్‌లు చేయడం, వేగంగా పరుగెత్తడం, కార్బ్-రిన్సింగ్ తర్వాత మరింత అప్రమత్తంగా ఉండ‌డాన్ని గుర్తించింది.

First Published:  24 Nov 2022 2:06 AM GMT
Next Story