Telugu Global
Sports

క్రికెట్ ప్రేమికుల‌కు హాట్‌స్టార్ గుడ్‌న్యూస్‌.. మొబైల్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ్రీగా చూడొచ్చు

బ‌స్ ఆవో.. ఫ్రీ మే దేఖ్తే జావ్ పేరుతో క్యాంప‌యిన్ కూడా స్టార్ట్ చేసింది. అయితే టీవీలో చూడాల‌నుకుంటే మాత్రం స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాలి.

క్రికెట్ ప్రేమికుల‌కు హాట్‌స్టార్ గుడ్‌న్యూస్‌.. మొబైల్‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ్రీగా చూడొచ్చు
X

ఈ నెలాఖ‌రు నుంచి క్రికెట్ ప్రేమికుల‌కు పండ‌గే పండ‌గ‌. ఆసియా క‌ప్‌, త‌ర్వాత వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌తో సందడే సంద‌డి. ఈ సంద‌డిని మ‌రింత ఉత్తేజితం చేసేలా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ సూప‌ర్ న్యూస్ చెప్పింది. ఆసియాక‌ప్‌, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ను హాట్‌స్టార్ మొబైల్ యాప్‌లో ఫ్రీగా చూడొచ్చ‌ని ప్ర‌క‌టించింది.

స‌బ్‌స్క్రిప్ష‌న్ అక్క‌ర్లేదు

క్రికెట్ మ్యాచ్ ప్ర‌సారాన్ని డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో చూడాలంటే ఆ ఓటీటీ స‌బ్ స్క్రిప్ష‌న్ త‌ప్ప‌నిస‌రి. అయితే వ‌రల్డ్ క‌ప్‌, ఆసియా క‌ప్ నేప‌థ్యంలో ఫ్యాన్స్‌కు మ‌రింత చేరువకావ‌డానికి మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా చూడొచ్చ‌ని హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది. బ‌స్ ఆవో.. ఫ్రీ మే దేఖ్తే జావ్ పేరుతో క్యాంప‌యిన్ కూడా స్టార్ట్ చేసింది. అయితే టీవీలో చూడాల‌నుకుంటే మాత్రం స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాలి.

జియోను దాటాల‌నేనా?

మొన్న‌టి ఐపీఎల్‌, తాజాగా వెస్టిండీస్‌, ఐర్లాండ్ సిరీస్‌ల‌ను ఫ్రీగా ప్ర‌సారం చేస్తూ జియో సినిమా యాప్ బీభత్స‌మైన వ్యూయ‌ర్‌షిప్ అందుకుంది. దీన్ని దాటాల‌నే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఈ ప్లాన్ చేసిందంటున్నారు. పైగా లీగ్ మ్యాచ్‌ల్లో ఎక్కువ డేలోనే కావ‌డంతో విద్య‌, ఉద్యోగ‌, వ్యాపార విధుల్లో ఉండేవారంతా మొబైల్ యాప్‌లోనే చూస్తార‌ని భావిస్తోంది.

First Published:  22 Aug 2023 7:32 AM GMT
Next Story