Telugu Global
Sports

రొనాల్డో...ప్రతి 112 నిముషాలకూ ఓ గోల్ !

ప్రపంచ క్లబ్ ఫుట్ బాల్ చరిత్రలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఓ అరుదైన ఘనత సాధించాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడుతూ తన 700వ గోల్ తో సరికొత్తరికార్డు నమోదు చేశాడు.

రొనాల్డో...ప్రతి 112 నిముషాలకూ ఓ గోల్ !
X

ప్రపంచ క్లబ్ ఫుట్ బాల్ చరిత్రలో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఓ అరుదైన ఘనత సాధించాడు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ కు ఆడుతూ తన 700వ గోల్ తో సరికొత్తరికార్డు నమోదు చేశాడు....

ప్రపంచ ఫుట్ బాల్ మొనగాడు, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన రికార్డులను తానే అధిగమిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రపంచ ఫుట్ బాల్ లో మాత్రమే కాదు...క్లబ్ ఫుట్ బాల్ లో సైతం రొనాల్డో గోల్ ల వర్షం కురిపిస్తున్నాడు.

సాకర్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన వీరుడిగా గతంలోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన రొనాల్డో తాజాగా..క్లబ్ ఫుట్ బాలర్ గా మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

క్లబ్ ఫుట్ బాల్ చరిత్రలో 700 గోల్స్ సాధించిన అసాధారణ ఘనతను సొంతం చేసుకొన్నాడు.

ప్రస్తుతం మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున ఆడుతున్న క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్ లో 700వ గోల్ నమోదు చేశాడు. ఎవర్టన్ క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో..

మాంచెస్టర్ 1-1 గోల్స్ తో ఉన్నసమయంలో సబ్ స్టిట్యూట్ గా ఆటలోకి దిగిన రొనాల్డో మెరుపుగోల్ సాధించి తనజట్టును 2-1 గోల్స్ తో విజేతగా నిలిపాడు.

మాంచెస్టర్ యునైటెడ్ తరపున రొనాల్డోకు ఇది 144వ గోల్ కాగా..రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున 450 గోల్స్, స్పోర్టింగ్ లిస్బన్ తరపున 5 గోల్స్, యువెంటస్ తరపున 101 గోల్స్ సాధించిన రికార్డు రొనాల్డోకు ఉంది. తన కెరియర్ లో వివిధక్లబ్ జట్లకు ఆడిన రొనాల్డో మొత్తం మీద 700 గోల్స్ మైలురాయిని చేరుకోగలిగాడు.

802 గోల్స్ తో రొనాల్డో టాప్...

ఇప్పటి వరకూ రొనాల్డో సాధించిన మొత్తం 802 గోల్స్ లో వివిధ క్లబ్ ల తరపున సాధించినవే 700 గోల్స్ ఉన్నాయి. తన జాతీయజట్టు పోర్చుగల్ తరపున 120 గోల్స్ సాధించడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

అంతేకాదుయయ బ్రెజిల్ దిగ్గజం పీలే పేరుతో దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న అత్యధిక అధికారిక గోల్స్ రికార్డును సైతం రొనాల్డో గత సీజన్లోనే అధిగమించాడు.

ఇటాలియన్ సాకర్ లీగ్ లో యువెంటస్ క్లబ్ కు ఆడుతున్న రొనాల్డో సెరియె 'ఎ' లీగ్ మ్యాచ్ లో కాగ్లియారీ జట్టుపై హ్యాట్రిక్ నమోదు చేయడం ద్వారా...తన కెరియర్ లో 770వ గోల్ సాధించగలిగాడు. ఈ క్రమంలో. అప్పటి వరకూ పీలే పేరుతో ఉన్న 767 గోల్స్ రికార్డును రొనాల్డో తెరమరుగు చేశాడు.

మరోవైపు...అెంతర్జాతీయ సాకర్ లో తాను సాధించిన రికార్డుల విశేషాలను 36 ఏళ్ల క్రిస్టియానో రొనాల్డో ఇన్ స్టా గ్రామ్ ద్వారా

అభిమానులతో పంచుకొంటూ వస్తున్నాడు. రొనాల్డోను ఇన్ స్టా ద్వారా అనుసరించే అభిమానులు 2 కోట్ల 70 లక్షల మంది ఉన్నారు.

ప్రతి 112 నిముషాలకు ఓ గోల్....

2019 సీజన్లో 700 గోల్స్ మైలురాయిని చేరిన రొనాల్డో 2021 సీజన్ నాటికి కానీ 770 గోల్స్ మార్క్ ను చేరలేకపోయాడు. 2022 సీజన్లో 800 గోల్స్ రికార్డును చేరుకోగలిగాడు.

తన కెరియర్ లో ఫుట్ బాల్ ఆడిన మొత్తం సమయంలో రొనాల్డో ప్రతి 112 నిముషాలకు ఓ గోల్ చొప్పున సాధించడం ఓ రికార్డుగా నిలిచిపోతుంది.

స్వీడన్ , లాత్వియా, ఆండోర్రా, అర్మీనియా ప్రత్యర్థులుగా పోర్చుగల్ తరపున రొనాల్డో అత్యధిక గోల్స్ నమోదు చేశాడు.

తాను రికార్డుల కోసం ఫుట్ బాల్ ఆడనని...స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ వెళితే గోల్స్ వాటంతట అవే వస్తాయని క్రిస్టియానో రొనాల్డో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.

First Published:  10 Oct 2022 10:00 AM GMT
Next Story