Telugu Global
Sports

ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ నంబర్ వన్ గా ప్రణయ్!

ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత సంచలనం హెచ్ఎస్ ప్రణయ్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సాధించాడు. 2022 సీజన్లో అత్యధిక ర్యాంకింగ్ పాయింట్లు సాధించడం ద్వారా నంబర్ వన్ గా నిలిచాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ నంబర్ వన్ గా ప్రణయ్!
X

ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత సంచలనం హెచ్ఎస్ ప్రణయ్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సాధించాడు. 2022 సీజన్లో అత్యధిక ర్యాంకింగ్ పాయింట్లు సాధించడం ద్వారా నంబర్ వన్ గా నిలిచాడు.....

క్రీడలు ఏవైనా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలవడం అంటే మాటలు కాదు. అందునా విపరీతమైన పోటీ ఉండే బ్యాడ్మింటన్ క్రీడలో టాప్ ర్యాంక్ సాధించే అవకాశం అతికొద్దిమందికి మాత్రమే దక్కుతుంది. అరుదైన ఆ ఘనతను భారత బ్యాడ్మింటన్ సంచలనం హెచ్ ఎస్ ప్రణయ్ అందుకొన్నాడు.

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించే 2022 సీజన్ టూర్ ర్యాంకింగ్స్ ప్రకారం ప్రణయ్ కు అగ్రస్థానం దక్కింది.

అరుదైన గౌరవం...

ప్రతి ఏటా జనవరి 11 నుంచి డిసెంబర్ 18 వరకూ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య..వివిధ దశలలో 22 రకాల టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. వీటిలో ఐదు స్థాయిలలో టూర్ టోర్నీలు ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవల్ 5 తరహా టోర్నీలలో పాల్గొనే ఆటగాళ్లకు ర్యాంకింగ్ పాయింట్లతో పాటు టోర్నీస్థాయిని బట్టి ప్రైజ్ మనీ కూడా సొంతమవుతుంది.

ప్రపంచ టూర్ ఫైనల్స్, సూపర్ -1000, సూపర్ -750, సూపర్ -500, సూపర్ -300 స్థాయిల్లో జరిగే మొత్తం 22 రకాల టూర్ టోర్నీలలో పాల్గొనడం ద్వారా ప్రణయ్ అత్యధిక పాయింట్లతో టాప్ ర్యాంకర్ గా అవతరించాడు.

2022 ఇండియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనలిస్ట్ గా తన టైటిళ్ల వేటను కొనసాగించిన ప్రణయ్ గత నాలుగేళ్ల కాలంలో తన కెరియర్ లోనే అత్యంత నిలకడగా రాణించడం ద్వారా అత్యుత్తమ ర్యాంక్ ను కైవసం చేసుకోగలిగాడు.

టూర్ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ గా నిలిచిన ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో మాత్రం 16వ స్థానం సంపాదించగలిగాడు. గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రణయ్ సాధించిన అత్యుత్తమ ర్యాంక్ ఇదే కావడం విశేషం.

మాజీ నంబర్ వన్ కిడాంబీ శ్రీకాంత్ రెండుస్థానాల మేర మెరుగుపరచుకోడం ద్వారా 12వర్యాంక్ కు చేరుకోగలిగాడు.

7వ ర్యాంకులో పీవీ సింధు...

కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ , ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు మహిళల సింగిల్స్ లో 7వ ర్యాంకర్ గా నిలిచింది. వెటరన్ సైనా నెహ్వాల్ 33వ ర్యాంకులో నిలిచింది.

పురుషుల, మహిళల విభాగాలలో కలిపి సింధు సాధించిన 7వ ర్యాంకే అత్యుత్తమ ర్యాంకుగా నమోదయ్యింది.

ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ టూర్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సాధించినా..సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో మాత్రం 16వ ర్యాంక్ కే పరిమితం కావాల్సి వచ్చింది.

First Published:  14 Sep 2022 9:37 AM GMT
Next Story