Telugu Global
Sports

స్వదేశంలో 200 మ్యాచ్ ల విరాట్ !

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో మూడో టెస్ట్ కోసం బరిలోకి దిగడం ద్వారా స్వదేశంలో 200 అంతర్జాతీయమ్యాచ్ ల రికార్డును చేరుకొన్నాడు.

స్వదేశంలో 200 మ్యాచ్ ల విరాట్ !
X

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ తన ఖాతాలో మరో అరుదైన రికార్డు జమ చేసుకొన్నాడు. స్వదేశంలో 200 అంతర్జాతీయమ్యాచ్ లు ఆడిన మొనగాడిగా నిలిచాడు...

భారత క్రికెట్ నయా పరుగుల యంత్రం, రికార్డుల మొనగాడు విరాట్ కొహ్లీ తన 15 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో మరో అరుదైన రికార్డు సాధించాడు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో మూడో టెస్ట్ కోసం బరిలోకి దిగడం ద్వారా స్వదేశంలో 200 అంతర్జాతీయమ్యాచ్ ల రికార్డును చేరుకొన్నాడు.

199 మ్యాచ్ లు...10వేల 829 పరుగులు

2008లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ ను ప్రారంభించిన విరాట్ గత 15 సంవత్సరాల కాలంలో..ప్రస్తుత సిరీస్ లోని ఢిల్లీ టెస్టు వరకూ క్రికెట్ మూడుఫార్మట్లలోనూ కలిపి 199 మ్యాచ్ లు ఆడి 10వేల 829 పరుగులు సాధించాడు. మొత్తం 221 ఇన్నింగ్స్ లో 34 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలతో పరుగుల మోత మోగించాడు.

254 పరుగుల అత్యధిక నాటౌట్ స్కోరుతో 58.22 సగటు నమోదు చేశాడు.

2020 సీజన్ నుంచి టెస్టు క్రికెట్లో విరాట్ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. 2020లో ఆరు ఇన్నింగ్స్ లో ఒకే ఒక హాఫ్ సెంచరీతో 116 పరుగులతో 19.33 సగటు మాత్రమే నమోదు చేయగలిగాడు.

ఇక..2021 సీజన్లో 10 టెస్టులు, 19 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 536 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలతో 28.21 సగటు నమోదు చేశాడు.

2022 సీజన్లో ఆరుమ్యాచ్ లు, 11 ఇన్నింగ్స్ లో 265 పరుగులు సాధించాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీతో 26.50 సగటు సాధించాడు.

ప్రస్తుత 2023 సీజన్ లో భాగంగా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోని మొదటి రెండుటెస్టులు, మూడు ఇన్నింగ్స్ లో 44, 20 స్కోర్లతో 76 పరుగులతో 25.33 సగటు నమోదు చేశాడు

4వేల పరుగుల రికార్డుకు చేరువగా...

ప్రస్తుత సిరీస్ లోని ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 31 బంతుల్లో 20 పరుగులు సాధించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 25వేల పరుగులు సాధించిన బ్యాటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పిన కొహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది.

ఇండోర్ టెస్టులో విరాట్ 77 పరుగుల స్కోరు సాధించగలిగితే..సొంతగడ్డపై 4వేల టెస్టు పరుగులు సాధించిన మరో అరుదైన రికార్డును అందుకోగలుగుతాడు.

34 సంవత్సరాల విరాట్ కొహ్లీకి..సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రస్తుత ఇండోర్ టెస్టుకు ముందు వరకూ 107 మ్యాచ్ లు ఆడి 181 ఇన్నింగ్స్ లో 8వేల 211 పరుగులు సాధించిన రికార్డు ఉంది. ఇందులో 27 శతకాలు, 7 ద్విశతకాలు, 28 అర్థశతకాలు ఉన్నాయి.

254 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 48. 59 సగటు సాధించాడు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ కలిపి విరాట్ 74 శతకాలు సాధించాడు.

First Published:  1 March 2023 6:11 AM GMT
Next Story