Telugu Global
Sports

పాక్ ఆతిథ్యంతో బీసీసీఐ పెద్దల ఉక్కిరిబిక్కిరి!

దారితప్పిన భారత్- పాక్ క్రికెట్ సంబంధాలు తిరిగి గాడిలో పడేటట్లు కనిపిస్తున్నాయి. ఉభయదేశాల క్రికెట్ బోర్డుల పెద్దలు స్నేహహస్తాలు చాచుకొంటూ మంతనాలు జరుపుతున్నారు.

పాక్ ఆతిథ్యంతో బీసీసీఐ పెద్దల ఉక్కిరిబిక్కిరి!
X

పాక్ ఆతిథ్యంతో బీసీసీఐ పెద్దల ఉక్కిరిబిక్కిరి!

దారితప్పిన భారత్- పాక్ క్రికెట్ సంబంధాలు తిరిగి గాడిలో పడేటట్లు కనిపిస్తున్నాయి. ఉభయదేశాల క్రికెట్ బోర్డుల పెద్దలు స్నేహహస్తాలు చాచుకొంటూ మంతనాలు జరుపుతున్నారు.

భారత్- పాకిస్థాన్ దేశాల సంబంధాలను రాజకీయ నేతలు తమ లబ్ది కోసం వాడుకొంటూ సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తుంటే, లేని శతృత్వాన్ని రాజేస్తుంటే..

రెండుదేశాల క్రికెట్ బోర్డుల పెద్దలు, ఆటగాళ్లు మాత్రం స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి నానాపాట్లు పడుతున్నారు.

గత 17 సంవత్సరాలుగా దారితప్పిన సంబంధాలను తిరిగి గాడిలో పెట్టడానికి భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల పెద్దలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఐసీసీ, ఏసీసీ టోర్నీలకే పరిమితం...

క్రీడా ప్రపంచంలో చిరకాల ప్రత్యర్థులుగా పేరుపొందిన భారత్, పాకిస్థాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ ల్లో పాల్గొని 15 సంవత్సరాలకు పైగా కాలం గడచిపోయింది. ఐసీసీ ప్రపంచ టోర్నీలతో పాటు ఆసియా క్రికట్ మండలి నిర్వహించే టోర్నీలలో మాత్రమే ముఖాముఖీ తలపడుతూ వస్తున్నాయి.

ప్రస్తుతం శ్రీలంక, పాక్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న 2023 ఆసియాకప్ టోర్నీలో సైతం ఇప్పటికే లీగ్ దశలో తలపడిన భారత్- పాక్ జట్లు ..మరోమారు..సూపర్ -4 రౌండ్లోనూ ఢీ కోనున్నాయి.

17సంవత్సరాల తర్వాత పాక్ లో బీసీసీఐ పెద్దలు...

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత క్రికెట్ బోర్డు చైర్మన్ రోజర్ బిన్నీ, బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మూడు రోజుల పాటు లాహోర్ లో పర్యటించి వచ్చారు.

భారత క్రికెట్ బోర్డు ప్రతినిధులు పాక్ గడ్డపై 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అటారీ- వాఘా సరిహద్దు ద్వారా లాహోర్ కు వెళ్లిన బీసీసీఐ చైర్మన్ రోజర్ బిన్నీ, వైస్ చైర్మన్ రాజీవ్ శుక్లా లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కనీవినీ ఎరుగని రీతిలో ఆహ్వానం పలికి మరీ అపూర్వ స్థాయిలో ఆతిథ్యమిచ్చింది.

తమను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మహరాజుల్లా చూసిందని, ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకొందని రోజర్ బిన్నీ మీడియాకు తెలిపారు.

లాహోర్ వేదికగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లు తిలకించడంతో పాటు..ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల గురించి చర్చించామని వివరించారు. పాక్ క్రికెట్ బోర్డు తమకు

ఇచ్చిన ఆతిథ్యం అపూర్వమంటూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం కొనియాడారు.

రెండు దేశాల నడుమ ద్వైపాక్షిక సిరీస్ ల తిరిగి పునరుద్దరించడానికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించామని, తుది నిర్ణయం తీసుకోవాల్సింది రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రమేనని బీసీసీఐ చైర్మన్ రోజర్ బిన్నీ స్పష్టం చేశారు.

2008లో భారత్ చివరి పర్యటన..

భారత జట్టు చివరిసారిగా ఆసియాకప్ లో పాల్గొనటానికి 2008లో పాక్ లో పర్యటించింది. అదే పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాత్రం 2006లో చివరిసారిగా భారత్ లో పర్యటించి వెళ్లింది.

ఆ తర్వాత నుంచి రెండు దేశాల క్రికెట్ జట్ల పరస్పర పర్యటనలు నిలిచిపోయాయి. తమ పాక్ పర్యటనతో ద్వైపాక్షిక సిరీస్ లు పునరుద్దరించే అవకాశాలు మెరుగయ్యాయని రాజీవ్ శుక్లా వివరించారు.

అక్టోబర్ లో భారత్ వేదికగా జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనటానికి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ జట్టు పాకిస్థాన్ రావాల్సి ఉంది. పైగా ఆసియా క్రికెట్ మండలి చైర్మన్ గా కూడా బీసీసీఐ కార్యదర్శి జే షా వ్యవహరిస్తున్నారు.

2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా భారత్- పాక్ జట్ల మ్యాచ్ అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.

First Published:  7 Sep 2023 11:58 AM GMT
Next Story