Telugu Global
Sports

బీసీసీఐకి తెలుగు రాష్ట్ర్రాలంటే అంత అలుసా?

తెలుగు రాష్ట్ర్రాల క్రికెట్ వేదికలంటే బీసీసీఐకి అలుసుగా మారింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని వేదికల్లోనూ భారతజట్టు ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడటం చర్చనీయాంశంగా మారింది.

బీసీసీఐకి తెలుగు రాష్ట్ర్రాలంటే అంత అలుసా?
X

తెలుగు రాష్ట్ర్రాల క్రికెట్ వేదికలంటే బీసీసీఐకి అలుసుగా మారింది. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని వేదికల్లోనూ భారతజట్టు ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడటం చర్చనీయాంశంగా మారింది.

పిల్లిగుడ్డిదైతే ఎలుక మీసాలు మేలివేసిందన్న సామెత తెలుగు రాష్ట్ర్రాల క్రికెట్ సంఘాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను కదిపి కుదిపేస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ తన ఆఖరి రౌండ్ మ్యాచ్ ను బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడటానికి సిద్ధమవుతుంటే అనూహ్యంగా ఓ చర్చకు తెరలేచింది.

హైదరాబాద్ మినహా అన్ని వేదికల్లోనూ....!

ప్రస్తుత ప్రపంచకప్ లో వరుసగా 8 విజయాలు సాధించడం ద్వారా 16 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన ఆతిథ్య భారతజట్టు తన చివరి లీగ్ మ్యాచ్ ను బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆడటానికి సిద్ధమయ్యింది.

మొదటి ఎనిమిది రౌండ్ల మ్యాచ్ లను దేశంలోని ఎనిమిది వేర్వేరు ( అహ్మదాబాద్, చెన్నై, ధర్మశాల, ఢిల్లీ, లక్నో, ముంబై, పూణే, కోల్ కతా ) వేదికల్లో ఆడిన భారతజట్టు..లీగ్ దశ చివరిమ్యాచ్ ను బెంగళూరు వేదికగా ఆడనుంది.

ప్రపంచకప్ కు దేశంలోని 10 వేదికలు ఆతిథ్యమిస్తుంటే ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిదివేదికల్లోనూ భారతజట్టు ఒక్కోమ్యాచ్ చొప్పున ఆడటంతో బీసీసీఐకి మాత్రమే కాదు..ఆయా క్రికెట్ సంఘాలకు కాసులపంట పండింది.

మ్యాచ్ కు 100 కోట్ల ఆదాయం..

భారతజట్టు మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియాలు కిటకిటలాడి పోటం సాధారణ విషయమే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు లక్ష మందికి పైగా అభిమానులు హాజరు కాగా..అతిచిన్నవేదిక ధర్మశాలకు 20 నుంచి 25 వేల మంది మాత్రమే హాజరయ్యారు.

చెన్నై చెపాక్ స్టేడియం లో జరిగిన ప్రారంభ రౌండ్ మ్యాచ్ నుంచి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన 8వ రౌండ్ మ్యాచ్ వరకూ భారీసంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు.

భారతజట్టు ఆడిన ఒక్కమ్యాచ్ ద్వారా బీసీసీఐ, ఐసీసీలకు 60 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకూ వివిధ రూపాలలో ఆదాయం సమకూరింది. భారత మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన ఆయా క్రికెట్ సంఘాలకు తమ వాటాగా భారీమొత్తంలో ఆదాయం వచ్చింది.

అయితే..దేశంలోని ప్రముఖ క్రికెట్ వేదికల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ ను పక్కన పెట్టి మిగిలిన తొమ్మిది వేదికలకూ భారత్ ఆడే మ్యాచ్ లను కేటాయించడం పట్ల అభిమానులు తీవ్రఅసంతృప్తితో ఉన్నారు.

కంటితుడుపుగా రెండుమ్యాచ్ లు...

రాజకీయాలే ప్రధానవ్యాపకంగా ఉన్న తెలుగు రాష్ట్ర్లాలంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు...చివరకు బీసీసీఐకి సైతం లోకువగా మారింది. అన్యాయం జరిగిన అడిగేవారు లేకపోడంతో ఆడింది ఆటగా,పాడింది పాటగా తయారయ్యింది.

ప్రపంచకప్ వేదికల్లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి చోటు కల్పించినా రెండు సన్నాహాకమ్యాచ్ లతో పాటు.. కంటితుడుపుగా రెండు ప్రపంచకప లీగ్ ( పాకిస్థాన్- శ్రీలంక, పాకిస్థాన్ -నెదర్లాండ్స్ ) మ్యాచ్ లను కేటాయించడం ద్వారా బీసీసీఐ చేతులు దులుపుకొంది.

రౌండ్ రాబిన్ లీగ్ దశలో భారతజట్టు ఆడే తొమ్మిది మ్యాచ్ ల్లో కనీసం ఒక్కమ్యాచ్ నూ హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం లేకుండా చేయడం పట్ల తెలుగు రాష్ట్ర్రాల క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

ఆంధ్ర క్రికెట్ సంఘానకి చెందిన విశాఖకు ప్రపంచకప్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం దక్కక పోయినా..కనీసం హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ ల్లో భారత్ ఆడే ఒక్కమ్యాచ్ ను నిర్వహించినా బాగుండేదని వాపోతున్నారు.

హైదరాబాద్ వేదికగా భారత్ ఆడిన తొమ్మిదిరౌండ్లలో కనీసం ఒక్కమ్యాచ్ ను కేటాయించినా అభిమానులకు తమ అభిమానజట్టు ఆడిన మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసిన ఆనందం మిగిలిఉండేది. అంతేకాదు..నిర్వాహక హైదరాబాద్ క్రికెట్ సంఘానికి భారీమొత్తంలో ఆదాయం ఒనగూరి ఉండేది.

ఏమాత్రం ప్రాధాన్యం లేని పాకిస్థాన్- శ్రీలంక, పాకిస్థాన్- నెదర్లాండ్స్ మ్యాచ్ లను కేటాయించడం ద్వారా బీసీసీఐ కార్యదర్శి జే షా..తెలుగు రాష్ట్ర్రాల క్రికెట్ అభిమానుల సహనాన్ని పరీక్షించారు.

హైదరాబాద్ క్రికెట్ సంఘం అవినీతి, రాజకీయాల రొచ్చు, ముఠాతగాదాలతో కొట్టి మిట్టాడుతుంటే....బీసీసీఐ మాత్రం సందట్లే సడేమియా అన్నట్లుగా ప్రధానమ్యాచ్ లన్నీ మిగిలిన తొమ్మిది వేదికలకు కేటాయించి హైదరాబాద్ కు మాత్రం రెండు కంటితుడుపు మ్యాచ్ లు నిర్వహించే అవకాశాన్ని ఇవ్వటాన్ని మించిన అవమానం మరొటి ఉండదు.

మారింది. తెలుగు రాష్ట్ర్రాలు, ప్రధానంగా హైదారాబాద్ అంటే అంత అలుసా అని అభిమానులు మండిపడుతున్నారు.

First Published:  11 Nov 2023 7:14 AM GMT
Next Story