Telugu Global
Sports

గిన్నిస్ బుక్ లో బీసీసీఐకి చోటు!

ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బీసీసీఐతో పాటు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియానికి చోటు దక్కింది.

గిన్నిస్ బుక్ లో బీసీసీఐకి చోటు!
X

గిన్నిస్ బుక్ లో బీసీసీఐకి చోటు!

ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో బీసీసీఐతో పాటు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియానికి చోటు దక్కింది.

క్రికెట్ తో ఏమాత్రం సంబంధంలేని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో నిర్మించిన అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియానికి..ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ లో చోటు దక్కింది.

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ నియంత్రణ మండలితో పాటు..బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్ కూ, గుజరాత్ క్రికెట్ సంఘానికీ అరుదైన గుర్తింపు లభించింది.

అంతర్జాతీయంగా వివిధ రంగాలకు చెందిన విలక్షణ అంశాలను ప్రపంచ రికార్డుల పేరుతో నిక్షిప్తం చేసే గిన్నిస్ బుక్ తాజా రికార్డుల్లో తమకు చోటు దక్కినట్లు బీసీసీఐ

ప్రకటించింది.

2021 ఐపీఎల్ ఫైనల్స్ కు అరుదైన ఘనత..

ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో లక్షా 1566 మంది అభిమానులు హాజరైన మ్యాచ్ గా 2022 ఐపీఎల్ ఫైనల్స్ కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో తాజాగా నమోదయ్యింది.

గుజరాత్ క్రికెట్ సంఘం అహ్మదాబాద్ లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఐపీఎల్ 15వ సీజన్ ఫైనల్ మ్యాచ్ కు వేదికగా నిలిచింది.

అహ్మదాబాద్ మోతెరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో 2022 మే నెల 29న గుజరాత్ టైటాన్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చూడటానికి..రికార్డు స్థాయిలో లక్షా 1566 మంది అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటి వరకూ జరిగిన అంతర్జాతీయ క్రికెట్, లీగ్ మ్యాచ్ ల చరిత్రలో అత్యధిక అభిమానులు హాజరైన మ్యాచ్ గా ఈ పోటీని గిన్నిస్ బుక్ నిర్వాహకులు నమోదు చేశారు.

తాము నమోదు చేసిన ఈ రికార్డు సర్టిఫికెట్ ను బీసీసీఐ కార్యదర్శి జే షాకు గిన్నిస్ బుక్ ప్రతినిధి అందచేశారు.

అభిమానులకు బీసీసీఐ హ్యాట్సాఫ్..

బీసీసీఐకి ఈ ఘనత , అరుదైన గుర్తింపు లభించడానికి అభిమానులే కారణమని బోర్డు కార్యదర్శి జే షా ప్రకటించారు. భారత క్రికెట్ ను, బీసీసీఐని ఇంతగా అభిమానించే అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియం చేరింది. 1982 వరకూ 49వేల సీటింగ్ సామర్థ్యంతో ఉన్న మోతేరా స్టేడియాన్ని సర్దార్ పటేల్ స్టేడియంగా పిలిచేవారు. అయితే స్టేడియాన్ని నరేంద్ర మోడీ పేరుతో పునర్నిర్మించారు. స్టేడియం సామర్థ్యాన్ని సైతం 49వేల నుంచి లక్షా 10వేలకు పెంచారు. గతంలోనే ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా నిలిచింది.

2022 ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ తో పాటు టైటిల్ సమరానికి సైతం నరేంద్ర మోడీ స్టేడియం ఆతిథ్యమిచ్చింది. భారతజట్టు ఆడిన డే-నైట్ టెస్టుకు ఆతిథ్యమిచ్చిన రెండో స్టేడియంగా రికార్డుల్లో చోటు సంపాదించింది.

First Published:  28 Nov 2022 8:09 AM GMT
Next Story