Telugu Global
Sports

అక్షర్ పటేల్ జీవితభాగస్వామిగా మేహా

గుజరాత్‌లోని వడోదర వేదికగా వీరి వివాహం సాంప్రదాయ గుజరాతీ పటేల్ పద్ధతిలో జరిగింది. ఈ వివాహానికి అక్షర్, మేహా పటేల్ ల కుటుంబసభ్యులు, బంధువులతో పాటు సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.

అక్షర్ పటేల్ జీవితభాగస్వామిగా మేహా
X

భారత క్రికెట్ కు మూడుఫార్మాట్లలోనూ గత రెండుసంవత్సరాలుగా అసమాన సేవలు అందిస్తూ..రవీంద్ర జడేజా లేని లోటును పూడ్చిన లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తన ప్రియురాలు మేహా పటేల్ ను ఏడాది నిరీక్షణ తర్వాత జీవితభాగస్వామిని చేసుకోగలిగాడు.

గుజరాత్‌లోని వడోదర వేదికగా వీరి వివాహం సాంప్రదాయ గుజరాతీ పటేల్ పద్ధతిలో జరిగింది. ఈ వివాహానికి అక్షర్, మేహా పటేల్ ల కుటుంబసభ్యులు, బంధువులతో పాటు సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.

సౌరాష్ట్ర్ర కెప్టెన్, భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ జంటతో పాటు పలువురు భారత క్రికెటర్లు వేడుకకు హాజరై నూతన వధూవరులను అభినందించారు.

గత రెండురోజులుగా ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలైన సంగీత్‌, మెహందీ ఈవెంట్లు సైతం ఘనంగా నిర్వహించారు. సంగీత్‌ సందర్భంగా అక్షర్‌– మేహా జంట కలిసి హుషారుగా డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

డైటీషియన్ గా మేహా పటేల్ కు పేరు...

గుజరాత్ లోని నదియాద్ కు చెందిన మేహా పటేల్ కు సోషల్ మీడియా ద్వారా డైటీషియన్ గా విశేషగుర్తింపే ఉంది. ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా పోషకాహారానికి సంబంధించిన అంశాలు షేర్ చేస్తూ మేహా భారీసంఖ్యలో ఫాలోవర్లను సంపాదించింది.

కాగా ..అక్షర్ పటేల్ తన 28వ పుట్టినరోజున స్నేహితురాలు మేహాను జీవితభాగస్వామిగా చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. నిశితార్థం కూడా జరుపుకొన్నాడు. అయితే..భారత్ తరపున టెస్టులు, వన్డేలు, టీ-20 ప్రపంచకప్ తో సహా సిరీస్ వెంట సిరీస్ , టోర్నీ వెంట టోర్నీ ఆడుతూ వివాహాన్ని వాయిదా వేసుకొంటూ వచ్చాడు.

న్యూజిలాండ్ తో జంట సిరీస్ లకు దూరం..

జనవరి 18 నుంచి న్యూజిలాండ్ తో ప్రారంభమైన తీన్మార్ వన్డే, టీ-20 సిరీస్ లకు అందుబాటులో లేకుండా.. వివాహవేడుకను ముగించాలని నిర్ణయించాడు. నిశ్చితార్థం జరుపుకొని ఏడాదికాలం పూర్తి కావడంతో రెండువైపులా కుటుంబసభ్యులు ఒత్తిడి చేయటంతో పెళ్లికోసం తీరిక చేసుకోగలిగాడు.

డైటీషియన్ గా పనిచేస్తున్న మేహా సోషల్ మీడియా ద్వారా చాలా చురుకుగా ఉంటూ వస్తోంది. అక్షర్ తో తన ప్ర్రేమాయణాన్ని చాలా గుట్టుగా కాపాడుకొంటూ వచ్చాడు. అయితే..ఈ మధ్యనే వివిధ సందర్భాలలో తాను అక్షర్ తో కలసి ఉన్న చిత్రాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొంది.

ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొనే భారతజట్టులో సభ్యుడిగా ఉన్న అక్షర్..జనవరి 9న నాగపూర్ వేదికగా జరిగే తొలిటెస్టు నాటికి అందుబాటులోకి రానున్నాడు.

స్టార్ ఆటగాడు కెఎల్ రాహుల్- అత్యాశెట్టిల పెళ్లివేడుకలు ముగిసిన వెంటనే అక్షర్ పటేల్ పెళ్లిఫోటోలు మీడియాద్వారా బయటకు వచ్చాయి.

First Published:  27 Jan 2023 7:41 AM GMT
Next Story