Telugu Global
Sports

43 ఏళ్ళ వయసులో భారత స్టార్ 500వ విజయం!

భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ డబుల్స్ స్టార్ రోహిన్ బొపన్న లేటు వయసులో ఘాటైన విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు. 2024 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మూడోరౌండ్లో అడుగుపెట్టాడు.

43 ఏళ్ళ వయసులో భారత స్టార్ 500వ విజయం!
X

భారత టెన్నిస్ ఎవర్ గ్రీన్ డబుల్స్ స్టార్ రోహిన్ బొపన్న లేటు వయసులో ఘాటైన విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు. 2024 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మూడోరౌండ్లో అడుగుపెట్టాడు....

భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహిన్ బొపన్న ప్రతిభకు వయసుతో పనిలేదని చెప్పకనే చెబుతున్నాడు. 43 సంవత్సరాల లేటు వయసులోనూ గ్రాండ్ స్లామ్ టోర్నీలలో తన విజయపరంపర కొనసాగిస్తున్నాడు.

ప్రస్తుత 2024 సీజన్ గ్రాండ్ స్లామ్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ మూడోరౌండ్ కు తనజోడీ మాథ్యూ ఈబ్డెన్ తో కలసి చేరుకొన్నాడు. తన సుదీర్ఘ టూర్ కెరియర్ లో 500వ విజయంతో అరుదైన రికార్డు నెలకొల్పాడు.

2 గంటల 9 నిముషాల పోరులో...

ప్రస్తుత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ డబుల్స్ లో 2వ సీడ్ హోదాలో బరిలో నిలిచిన రోహన్ బొపన్న జోడీ 2 గంటల 9 నిముషాలపోరులో రెండోరౌండ్ విజయం సాధించారు.

జేమ్స్ డక్ వర్త్- మార్క్ పోల్ మాన్స్ జోడీతో జరిగిన పోరులో బోపన్నజోడీ 39 విన్నర్లు, 8 ఏస్ లతో మూడుసెట్ల విజయం నమోదు చేశారు. 7-6, 4-6, 7-6తో విజేతగా నిలిచారు. టూర్ స్థాయిలో 24 టైటిల్స్ నెగ్గిన రోహన్ బొపన్న గ్రాండ్ స్లామ్ టైటిల్ విజయం కోసం తహతహలాడుతున్నాడు.

ఫెదరర్ సరసన జోకోవిచ్...

పురుషుల సింగిల్స్ లో టాప్ సీడ్, 10 టైటిల్స్ విజేత నొవాక్ జోకోవిచ్ 36 సంవత్సరాల వయసులో ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ 4వ రౌండ్ చేరిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన 3వ రౌండ్ మ్యాచ్ లో జోకోవిచ్ 2 గంటల 28 నిముషాలలో వరుస సెట్ల విజయం నమోదు చేశాడు. 6-3, 6-3, 7-6తో థామస్ ఇచ్ వెర్రీని ఓడించాడు.

గత 45 సంవత్సరాల ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ చరిత్రలో 36 సంవత్సరాల వయసులో నాలుగోరౌండ్ చేరిన రెండో ఆటగాడిగా జోకోవిచ్ రికార్డు సాధించాడు. గతంలో ఇదే ఘనత సాధించిన రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు.

జోకోవిచ్ 31వ గెలుపు....

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ చరిత్రలో వరుసగా 30 సింగిల్స్ విజయాలు సాధించిన మోనికా సెలెస్ రికార్డును జోకోవిచ్ 31వ గెలుపుతో అధిగమించాడు. మొదటి రెండురౌండ్లలోనూ చెమటోడ్చి నెగ్గిన జోకోవిచ్ కు మూడో రౌండ్ విజయం నల్లేరుమీద బండిలా సాగింది.

మహిళల సింగిల్స్ 4వ రౌండ్ కు చేరడం ద్వారా రష్యన్ టీనేజ్ సంచలనం మిరార్ చరిత్ర సృష్టించింది. మరో మూడోరౌండ్ పోరులో 10వ సీడ్ హడాడ్ మియాను 7-6, 6-3తో మారియా టిమోఫీవా కంగు తినిపించింది.

First Published:  20 Jan 2024 3:00 AM GMT
Next Story