Telugu Global
Sports

వేడుకగా ముగిసిన రాహుల్- ఆత్యా పెళ్ళి!

వేడుకగా ముగిసిన రాహుల్- ఆత్యా పెళ్ళి!
X

భారత స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్, బాలీవుడ్ నటి, మోడల్ ఆత్యా శెట్టి మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఖండాల వేదికగా స్నేహితులు, ఇరుకుటుంబాల సమక్షంలో ఈ వేడుక ముగిసింది...

క్రికెట్ మూడుఫార్మాట్లలో భారత స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న సినీ నటి, మోడల్ ఆత్యాశెట్టిని ఈరోజు తన జీవితభాగస్వామిగా చేసుకొన్నాడు.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పెద్దకుమార్తె ఆత్యాశెట్టితో గత కొద్ది సంవత్సరాలుగా రాహుల్ రహస్యంగా డేటింగ్ చేస్తూ వస్తున్నాడు. రెండుకుటుంబాల సమ్మతితో..

మహారాష్ట్ర్రలోని ఖండాలలో అత్యంత విలాసవంతమైన సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో గత మూడురోజులుగా హల్దీ, సంగీత్ వంటి వేడుకలను మీడియా కంట పడకుండా నిర్వహిస్తూ వచ్చారు.

సోమవారం సాయంత్రం 4-30 గంటలకు వివాహవేడుక ముగిసిన అనంతరం మీడియాకు మిఠాయిలు పంచిన అనంతరం తన కుమార్తె వివాహం విషయాన్ని సునీల్ శెట్టి అధికారికంగా ప్రకటించారు.

రాహుల్ పెళ్లికి క్రికెటర్ల దూరం..

న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లోని ఆఖరి మ్యాచ్ కోసం ఇండోర్ లో విడిది చేసిన క్రికెటర్లు..రాహుల్ వివాహానికి హాజరుకాలేకపోయారు. కర్నాటకజట్టులోని రాహుల్ సహ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. బాలీవుడ్ ప్రముఖులు పలువురు సైతం వివాహవేడుకల్లో పాలుపంచుకొన్నారు.

బెంగళూరు, ముంబై నగరాలలో రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేవలం తన వివాహం కోసమే రాహుల్..న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రస్తుత వన్డే, టీ-20 సిరీస్ లకు దూరంగా ఉన్నాడు.

ఐసీసీ టెస్టులీగ్ లో భాగంగా ఆస్ట్ర్రేలియాతో వచ్చేనెలలో ప్రారంభంకానున్న నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కు సైతం రాహుల్ అందుబాటులో ఉండనున్నాడు.

First Published:  23 Jan 2023 2:45 PM GMT
Next Story