Telugu Global
Sports

రెండుదేశాల ఆతిథ్యంలో ఆసియాకప్ సందడి!

2023- ఆసియాకప్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ కు పాకిస్థాన్, శ్రీలంక దేశాలు వేదికలుగా రంగం సిద్ధమయ్యింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరిగే ఈ టోర్నీలో భారత్ తో సహా మొత్తం ఆరు దేశాలు తలపడనున్నాయి.

2023- ఆసియాకప్ క్రికెట్ చాంపియన్షిప్
X

2023- ఆసియాకప్ క్రికెట్ చాంపియన్షిప్

2023- ఆసియాకప్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ కు పాకిస్థాన్, శ్రీలంక దేశాలు వేదికలుగా రంగం సిద్ధమయ్యింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరిగే ఈటోర్నీలో భారత్ తో సహా మొత్తం ఆరుదేశాలు తలపడనున్నాయి.

ఆసియా క్రికెట్ మండలి ఆధ్వర్యంలో జరిగే ఆసియాకప్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ పరంపరలో భాగంగా 2023 టోర్నీకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఆసియాకప్ చరిత్రలోనే తొలిసారిగా రెండు దేశాల సంయుక్త ఆతిథ్యంలో...హైబ్రిడ్ మోడల్ విధానం ప్రకారం 2023 టోర్నీ జరుగనుంది.

ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరిగే ఈ వన్డే సమరాన్ని గ్రూపులీగ్ కమ్ నాకౌట్ తరహాలో నిర్వహిస్తున్నారు.

పాకిస్థాన్, శ్రీలంక దేశాలలో...

వాస్తవానికి 2023 ఆసియాకప్ టోర్నీకి పాకిస్థాన్ పూర్తిస్థాయిలో ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే భారత్- పాక్ దేశాల నడుమ క్రికెట్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండటంతో...భారత్ ఆడే మ్యాచ్ లను శ్రీలంక వేదికగా నిర్వహించడం కోసం హైబ్రిడ్ విధానాన్నిపాటిస్తున్నారు.

మొతం ఆరు ఆసియా అత్యుత్తమ జట్లు ( భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక ) రెండు గ్రూపులుగా తలపడనున్నాయి.

గ్రూప్- ఏ లీగ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తో పసికూన నేపాల్ పోటీపడుతుంటే...గ్రూప్ - బీ లీగ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

సెప్టెంబర్ 2 భారత తొలిపోరు..

ప్రస్తుత ఆసియాకప్ ప్రారంభ మ్యాచ్ కు ముల్తాన్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఆగస్టు 30న జరిగే ఈ పోరులో ఆతిథ్య పాకిస్థాన్ కు నేపాల్ సవాలు విసురుతోంది.

ప్రపంచ మూడో ర్యాంకర్, 7సార్లు విన్నర్ భారత్ మాత్రం తన ప్రారంభ మ్యాచ్ లో టాప్ ర్యాంకర్ పాకిస్థాన్ ను ఢీ కోనుంది. శ్రీలంకలోని పల్లెకెలీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్- పాక్ జట్ల పోరు ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 5న నేపాల్ తో భారత్ పోటీపడుతుంది.

ఈ టోర్నీలో పాల్గొంటున్న భారత జట్టుకు రోహిత్ శర్మ, పాక్ జట్టుకు బాబర్ అజం, బంగ్లా జట్టుకు షకీబుల్ హసన్, నేపాల్ జట్టుకు రోహిత్ పౌడేల్, ఆఫ్ఘనిస్థాన్ కు హస్మతుల్లా షాహీదీ, శ్రీలంక జట్టుకు దసున్ షనక నాయకత్వం వహిస్తున్నారు.

తొలి దశ గ్రూపు లీగ్, రెండో దశ సూపర్ -4 నుంచి సెమీఫైనల్స్ నాకౌట్ వరకూ మొత్తం 13 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ముల్తాన్, లాహోర్, పల్లెకెలీ, కొలంబో నగరాలు వేదికలుగా మ్యాచ్ లు జరుగనున్నాయి.

సెప్టెంబర్ 6 నుంచి 15 వరకూ నాలుగు జట్ల సూపర్ -4 రౌండ్ మ్యాచ్ లు జరుగుతాయి.

భారత కాలమాన ప్రకారం మ్యాచ్ లు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ కు చెందిన డిస్నీ, హాట్ స్టార్ యాప్ ల ద్వారా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారాలను చూడవచ్చు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్ తో కలసి సూపర్ -4 రౌండ్ కు సునాయాసంగా చేరుకొనే అవకాశాలున్నాయి.


First Published:  29 Aug 2023 11:09 AM GMT
Next Story