Telugu Global
Sports

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వీన్ సబలెంకా!

2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వీన్ గా బెలారుస్ ప్లేయర్ అర్యానా సబలెంకా అవతరించింది.

Aryna Sabalenka defeats Elena Rybakina to win thrilling women’s Australian Open final
X

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ క్వీన్ సబలెంకా!

2023 ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వీన్ గా బెలారుస్ ప్లేయర్ అర్యానా సబలెంకా అవతరించింది. మూడుసెట్ల పోరులో రిబకినా పై విజయం సాధించింది.

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ 2023 సీజన్ తొలిటోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను బెలారుస్ ప్లేయర్ అర్యానా సబలెంకా కైవసం చేసుకొంది. మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా జరిగిన మూడుసెట్ల పోరులో 5వ సీడ్ సబలెంకా తొలిసెట్ చేజారినా 4-6, 6-3, 6-4తో 22వ సీడ్ ఎలెనా రిబకినాను అధిగమించి తన కెరియర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ట్రోఫీ అందుకొంది.

సబలెంకా జోరు- రిబకినా బేజారు..

తొలిసెట్ ను 6-4తో నెగ్గి..రెండో సెట్ ప్రారంభం వరకూ జోరుమీదున్న కజకిస్థాన్ ప్లేయర్ ఎలెనా రిబకినా పైన ప్రత్యర్థి సబలెంకా ఎదురుదాడి మొదలు పెట్టింది. 51 విన్నర్లు, 17 ఏస్ లతో చెలరేగిపోయింది.6-3తో రెండో సెట్ నెగ్గడం ద్వారా 1-1తో సమఉజ్జీగా నిలిచింది. నిర్ణయాత్మక ఆఖరి సెట్ మొదటి భాగం నువ్వానేనా అన్నట్లుగా సాగినా సబలెంకా 6-4తో నెగ్గి విజేతగా నిలిచింది.రెండున్నర గంటలపాటు సాగిన ఈ సమరం అభిమానుల

ఈ విజయంతో 24 ఏళ్ళ సంబలెంకాకు ట్రోఫీతో పాటు 15 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ సైతం దక్కింది. 2023 సీజన్లో ప్రస్తుత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ వరకూ ఆడిన 11 మ్యాచ్ ల్లోనూ సబలెంకా అజేయంగా నిలవడం విశేషం.

వింబుల్డన్ చాంపియన్ రిబకినా 31 విన్నర్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది.


► Read latest Sports News and Telugu News

► Follow us on Facebook , Twitter & Google News

First Published:  28 Jan 2023 12:26 PM GMT
Next Story