Telugu Global
Sports

టెస్టు చరిత్రలో యాండర్సన్ చెత్తరికార్డు!

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఎన్నో గొప్ప రికార్డులు నెలకొల్పిన ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ ఓ చెత్త రికార్డును సైతం మూటకట్టుకోవాల్సి వచ్చింది.

టెస్టు చరిత్రలో యాండర్సన్ చెత్తరికార్డు!
X

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఎన్నో గొప్ప రికార్డులు నెలకొల్పిన ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ ఓ చెత్త రికార్డును సైతం మూటకట్టుకోవాల్సి వచ్చింది.

క్రికెట్ బహుచిత్రమైన క్రీడ. క్రికెటర్లకు గొప్ప రికార్డులతో పాటు చెత్త రికార్డులను సైతం ఇవ్వటంలో క్రికెట్ కు క్రికెట్ మాత్రమే సాటి. ఇంగ్లండ్ వెటరన్ ఫాస్ట్ బౌలర్, 41 సంవత్సరాల జేమ్స్ యాండర్సన్ ఇప్పటి వరకూ ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పుతూ వచ్చాడు. అయితే..రాజకోట వేదికగా భారత్ తో జరుగుతున్న 3వ టెస్ట్ రెండోరోజుఆటలో ఓ చెత్తరికార్డును తన ఖాతాలో అయిష్టంగానే వేసుకోవాల్సి వచ్చింది.

అనీల్ కుంబ్లే ను మించిన యాండర్సన్...

41 సంవత్సరాల లేటు వయసులో 185వ టెస్టు మ్యాచ్ ఆడిన తొలి స్వింగ్ బౌలర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పిన జేమ్స్ యాండర్సన్ అత్యధిక పరుగులు సమర్పించుకొన్న టెస్టు బౌలర్ గాను రికార్డుల్లో చేరాడు.

ఇప్పటి వరకూ భారత లెగ్ స్పిన్నర్ అనీల్ కుంబ్లే పేరుతో ఉన్న రికార్డును యాండర్సన్ మించిపోయాడు. రాజకోటలోని నిరంజన్ షా స్టేడియం వేదికగా భారత్ తో జరుగుతున్న మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్ లో యాండర్సన్ 25 ఓవర్లలో 61 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతేకాదు..14 దశాబ్దాల టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

అనీల్ కుంబ్లే తన టెస్టు కెరియర్ లో ఆడిన టెస్టుల్లో 18వేల 355 పరుగులు సమర్పించుకొంటే..ఆ రికార్డును యాండర్సన్ 185 టెస్టుల్లో 18వేల 371 పరుగులతో అధిగమించాడు.

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 18180 పరుగులు, షేన్ వార్న్ 17995 పరుగులు, ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 16,719 పరుగులు ఇచ్చిన బౌలర్లుగా మొదటి ఐదుస్థానాలలో కొనసాగుతున్నారు.

అత్యధిక వికెట్ల బౌలర్లలో మూడోస్థానం..

టెస్టు చరిత్రలో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన మూడోబౌలర్ గా యాండర్సన్ నిలిచాడు. 696 వికెట్లతో 700 వికెట్ల మైలురాయికి కేవలం 4 వికెట్ల దూరంలో నిలిచాడు. మొత్తం 800 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వార్న్ 708 వికెట్లతో రెండు, యాండర్సన్ 696 వికెట్లతో మూడు స్థానాలలో ఉన్నారు.

అంతేకాదు..అంతర్జాతీయ క్రికెట్లో మురళీధరన్ 1347 వికెట్లు, వార్న్ 1001 వికెట్లు పడగొడితే ..యాండర్సన్ 1000 వికెట్లతో మొదటి మూడుస్థానాలలో నిలిచారు.

భారతగడ్డపై యాండర్సన్ కు ఇదే ఆఖరి సిరీస్ కానుంది.

First Published:  18 Feb 2024 4:15 AM GMT
Next Story