Telugu Global
Sports

హేమాహేమీలతో ప్రపంచకప్ వ్యాఖ్యాతల బృందం

ఆస్ట్ర్రేలియా వేదికగా ప్రారంభమైన టీ-20 ప్రపంచకప్ కోసం పలువురు విఖ్యాత కామెంటీటర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. భారత్ కు చెందిన సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్ష బోగ్లే లకు ఈ బృందంలో చోటు దక్కింది.

హేమాహేమీలతో ప్రపంచకప్ వ్యాఖ్యాతల బృందం
X

ఆస్ట్ర్రేలియా వేదికగా ప్రారంభమైన టీ-20 ప్రపంచకప్ కోసం పలువురు విఖ్యాత కామెంటీటర్ల పేర్లను ఐసీసీ ప్రకటించింది. భారత్ కు చెందిన సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్ష బోగ్లే లకు ఈ బృందంలో చోటు దక్కింది...

క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు ప్రత్యక్షప్రసారాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాదిమంది వీక్షించడం సాధారణ విషయమే. అయితే...ఈ మ్యాచ్ లను ప్రసారం చేయటం ఎంత ముఖ్యమో..తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణుల వర్ణన, విశ్లేషణ కూడా అంతే ప్రధానం. కళ్లముందు జరిగే మ్యాచ్ లోని వింతలు, విశేషాలు, సాంకేతిక అంశాలు, లోటుపాట్ల గురించి అందంగా, సవివరంగా వీక్షకుల చెవిన పడేయటమే కామెంటీటర్ల పని.

ప్రపంచకప్ కు భారీ బృందం..

ఆస్ట్రేలియా వేదికగా నవంబర్ 13 వరకూ జరుగనున్న 2022 టీ-20 ప్రపంచకప్ లోని మొత్తం 45మ్యాచ్ ల ప్రత్యక్షప్రసారాల కోసం ఐసీసీ విస్ర్త్తుత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ ల లైవ్ టెలికాస్ట్ లో అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది.

అంతేకాదు...క్రికెట్ వ్యాఖ్యానం కోసం వివిధ దేశాలకు చెందిన పురుష,మహిళా కామెంటీటర్లను ఖరారు చేసింది.

ముగ్గురు భారత వ్యాఖ్యతలకు చోటు..

ఐసీసీ ఎంపిక చేసిన కామెంటీటర్ల బృందంలో భారత మాజీ కెప్టెన్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, స్పెషలిస్ట్ కామెంటీటర్ హర్షబోగ్లే సైతం ఉన్నారు. ఇతర వ్యాఖ్యాతలలో ఇయాన్ బిషప్,మైకేల్ అథర్టన్, డాని మోరిసన్, షేన్ వాట్సన్, మైకేల్ క్లార్క్, డిర్క్ నానెస్,రస్సెల్ ఆర్నాల్డ్, ఇషా గుహా, కార్లోస్ బ్రాత్ వెయిట్, శామ్యూల్ బద్రీ,డేల్ స్టెయిన్, షాన్ పొలాక్, సునీల్ గవాస్కర్, సైమన్ డూల్, నాసిర్ హుస్సేన్, వోయిన్ మోర్గాన్ ఉన్నారు. ఆడం గిల్ క్రిస్ట్, మెల్ జో్న్స్, షేన్ వాట్సన్, మైకేల్ క్లార్క్ సైతం కామెంటరీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

తొలిదశ గా జరుగుతున్న క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలలో బ్రియన్ ముర్గట్రాయిడ్, డిర్క్ నానెస్, నీల్ ఓ బ్రియన్, పెర్‌ స్టన్ మోమ్సెన్ లను కామెంటీటర్లుగా పరీక్షించనున్నారు.

హాక్-ఐ టెక్నాలజీతో....

ప్రపంచకప్ మ్యాచ్ ల ప్రత్యక్షప్రసారాలలో అత్యున్నత ప్రమాణాలు పాటించడానికి ఐసీసీ అత్యాధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. బాల్ ట్రాకింగ్, ఎడ్జ్ డిటెక్షన్ కోసం హాక్ -ఐ టెక్నాలజీ, ఇన్ డెప్త్ డాటా అనలిటిక్స్, గ్రాఫిక్స్ ను క్రిక్ విజ్ సమకూర్చింది.

డ్రోన్ కెమెరాలను లెవెల్ హారిజోన్స్ అందుబాటులో ఉంచింది. రోవింగ్ బగ్గీ కెమెరాలను, స్పైడర్ కెమెరాలను వినియోగిస్తున్నారు. మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తున్న వేదికల పరిసర ప్రాంతాలలోని భౌగోళిక అందాలు, విశేషాలను చిత్రీకరించడంతో పాటు వీక్షకుల ముందు నయనమనోహరంగా ఉంచనున్నారు.

అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరిగే ఈ ప్రపంచకప్ టోర్నీలోని మొత్తం 45 మ్యాచ్ ల ప్రత్యక్షప్రసారం వీక్షకులకు కలకాలం గుర్తుండిపోతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  17 Oct 2022 5:13 AM GMT
Next Story