Telugu Global
Sports

4 ఓవర్లలో 4 వికెట్లు..చోటా సచిన్ షో!

అర్జున్ మొత్తం 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.. అర్జున్ కెరియర్ లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ రికార్డు కావడం విశేషం.

4 ఓవర్లలో 4 వికెట్లు..చోటా సచిన్ షో!
X

ముంబైలో తగిన అవకాశాలు లేక పొరుగునే ఉన్న గోవాకు వలస వెళ్లిన మాస్టర్ సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ సత్తా చాటుకొన్నాడు.జాతీయ టీ-20 క్రికెట్ లో భాగంగా హైదరాబాద్ తో జరిగిన గ్రూప్ పోటీలో చోటా సచిన్ 4 ఓవర్లలో 4 వికెట్లతో చెలరేగిపోయాడు.....

దేశవాళీ టీ-20 ( సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ) క్రికెట్ టోర్నీ రెండోసీజన్లోనే మాస్టర్ సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఫాస్ట్ బౌలర్ గా సత్తా చాటుకొన్నాడు.

జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా హైదరాబాద్ జట్టుతో జరిగిన పోటీలో గోవాతరపున బరిలోకి దిగాడు.

4 ఓవర్లు..17 డాట్ బాల్స్...4 వికెట్లు

గత సీజన్లో ముంబై క్రికెట్ సంఘానికి ప్రాతినిథ్యం వహించిన అర్జున్ టెండుల్కర్ తగిన అవకాశాలు లభించక నీరసపడిపోయాడు. గట్టిపోటీ ఉండడంతో ముంబైజట్టులో తనకు చోటు దక్కదని గ్రహించిన అర్జున్ ..పొరుగునే ఉన్న గోవాకు వలస వెళ్లాడు.

2022 సీజన్ నుంచి గోవా క్రికెట్ సంఘానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్...ముస్తాక్ అలీ టీ-20 టోర్నీపోరు మూడోరౌండ్ మ్యాచ్ లో కానీ సత్తా చాటుకోలేకపోయాడు.

త్రిపుర, మణిపూర్ జట్లతో జరిగిన ప్రారంభరౌండ్ల మ్యాచ్ ల్లో అంతగా ప్రభావం చూపని అర్జున్..పవర్ ఫుల్ హైదరాబాద్ తో జరిగిన మూడోరౌండ్ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు.

తనకోటా 4 ఓవర్ల ( 24 బంతుల్లో ) లో ఓ మేడిన్ ఓవర్ తో సహా 17 డాట్ బాల్స్ వేసి వారేవ్వా అనిపించుకొన్నాడు. అంతేకాదు హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మతో సహా మరో ముగ్గురు ఆటగాళ్ళను పడగొట్టాడు. వికెట్ కీపర్ ప్రతీక్ రెడ్డి, రాహుల్, రవి తేజలను అర్జున్ పెవీలియన్ దారి పట్టించాడు. అర్జున్ జోరుతో హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అర్జున్ మొత్తం 4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.. అర్జున్ కెరియర్ లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ రికార్డు కావడం విశేషం.

యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ దగ్గర శిక్షణ పొందుతున్న అర్జున్ కు గతంలో భారత్ తరపున రెండు అండర్ -19 టెస్టులు, 2021-22 సీజన్లో ముంబై తరపున రెండు ముస్తాక్ అలీ టోర్నీ మ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది.

First Published:  15 Oct 2022 6:15 AM GMT
Next Story