Telugu Global
Science and Technology

కోడి ముందా? గుడ్డు ముందా? జవాబు కనిపెట్టిన సైంటిస్టులు!

కోడి ముందా..గుడ్డు ముందా అనే చిక్కు ప్రశ్న ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. అయితే ఎప్పటికీ పజిల్‌గా ఉండే ఈ ప్రశ్నకు సైంటిస్టులు సమాధానాన్ని కనుగొన్నారు.

కోడి ముందా? గుడ్డు ముందా? జవాబు కనిపెట్టిన సైంటిస్టులు!
X

కోడి ముందా? గుడ్డు ముందా? జవాబు కనిపెట్టిన సైంటిస్టులు!

కోడి ముందా..గుడ్డు ముందా అనే చిక్కు ప్రశ్న ఎప్పటినుంచో వింటూ ఉన్నాం. అయితే ఎప్పటికీ పజిల్‌గా ఉండే ఈ ప్రశ్నకు సైంటిస్టులు సమాధానాన్ని కనుగొన్నారు. ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఈ ప్రశ్నకు ఒక ఆన్సర్ అయితే దొరికింది. అదేంటంటే..

జీవ పరిణామ క్రమంపై చేస్తున్న పరిశోధనల్లో భాగంగా కప్పలు, ఉభయచరాలు, బల్లులు, పక్షులపై సైంటిస్టులు ఎన్నో అధ్యయనాలు చేశారు. అయితే ఈ స్టడీల ఆధారంగా సైంటిస్టులు ‘కోడి ముందు’ అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. ఒకప్పుడు పక్షులు, క్షీరదాలు వంటివి గుడ్లు పెట్టడానికి బదులు నేరుగా పిల్లలకు జన్మనిచ్చేవని చెప్తున్నారు.

సుమారు 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ విషయాన్ని కనుగొన్నట్టు సైంటిస్టులు పేర్కొన్నారు. గుడ్లు పెట్టే చాలా రకాల జాతులు మొదట్లో నేరుగా జన్మనిచ్చేవట. పక్షులు మొదట్లో పునరుత్పత్తి కోసం నీటి వనరులకు సమీపంలో నివశించేవని, పరిస్థితులు అనువుగా మారే వరకు తల్లి తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేదని సైంటిస్టుల పరిశోధనలో తేలింది.

అయితే పరిణామక్రమంలో భాగంగా భూమిపై జీవించడానికి అలవాటు పడ్డాక క్రమంగా కొన్ని జాతులు గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయట. ఈ లెక్కన చూస్తే జీవం మొదలైన మొదట్లో గుడ్లు లేవని, కాబట్టి కోడే ముందని సైంటిస్టులు అంటున్నారు. నేచర్‌ ఎకాలజీ అండ్‌ ఎవల్యూషన్ జర్నల్‌లో ఈ స్టడీ గురించిన విషయాలు పబ్లిష్ అయ్యాయి.

First Published:  20 Jun 2023 9:08 AM GMT
Next Story