Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో కెప్ట్ మెసేజెస్ ఫీచర్! ఎలా పనికొస్తుందంటే..

పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. డిజప్పియరింగ్ చాట్స్‌లోని ముఖ్యమైన మెసేజ్‌లను సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ తీసుకురాబోతోంది. ‘కెప్ట్ మెసేజెస్’ పేరుతో రాబోయే ఈ ఫీచర్ సాయంతో మెసేజ్‌లను టెంపరరీగా సేవ్ చేసుకునే వీలుంటుంది.

WhatsApp
X

వాట్సాప్‌

పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సప్.. డిజప్పియరింగ్ చాట్స్‌లోని ముఖ్యమైన మెసేజ్‌లను సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ తీసుకురాబోతోంది. ‘కెప్ట్ మెసేజెస్’ పేరుతో రాబోయే ఈ ఫీచర్ సాయంతో మెసేజ్‌లను టెంపరరీగా సేవ్ చేసుకునే వీలుంటుంది.

ప్రస్తుతం ఏదైనా వాట్సప్ చాట్‌కు ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ టర్న్ ఆన్ చేస్తే.. ఆ చాట్‌లోని మెసేజ్‌లన్నీ సెట్ చేసుకున్న టైంను బట్టి ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా డిజప్పియరింగ్ మెసేజెస్ ఆన్ చేసినా కూడా ఆ చాట్‌లో ముఖ్యమైన మెసేజెస్‌ను సేవ్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది వాట్సాప్.

కెప్ట్ మెసేజెస్ లేదా సేవ్డ్‌ మెసేజెస్ ఫీచర్‌ను ఉపయోగించి చాట్‌లోని మెసేజెస్‌ను తాత్కాలికంగా సేవ్ చేయొచ్చు. ఇలా సేవ్ చేసిన మెసేజ్‌లు చాట్ నుంచి ఆటోమేటిక్‌గా డిలీట్ అవ్వవు. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే వాటిని ‘అన్-కీప్’ చేయొచ్చు.

అప్పుడు ఆ మెసేజ్‌లు చాట్ నుంచి పర్మినెంట్‌గా డిజప్పియర్‌ అవుతాయి. వాట్సప్‌లో స్టార్‌ మెసేజెస్‌పై స్టార్ గుర్తు ఎలా ఉంటుందో అలా ఈ సేవ్డ్‌ లేదా కెప్ట్ మెసేజ్‌పై కూడా ఒక గుర్తు ఉంటుంది.

వీటిని కావలసినప్పుడు అన్‌సేవ్ చేయడం ద్వారా డిలీట్ చేసుకోవచ్చు. వాట్సప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లోనే ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఇక దీంతోపాటు వాట్సప్ క్యూఆర్ కోడ్‌ని ఉపయోగించి ఒక డివైజ్ నుంచి మరొక డివైజ్‌కి డేటాను ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. వాట్సాప్ ద్వారా ఈజీగా డేటాను షేర్ చేసుకోడాడికి ఈ ఫీచర్ పనికొస్తుంది.

First Published:  25 Jan 2023 6:58 AM GMT
Next Story