Telugu Global
Science and Technology

త్వ‌ర‌లోనే కొత్త ఫీచ‌ర్‌.. వాట్స‌ప్‌లో నిమిషంపాటు స్టేట‌స్ వీడియో

స్టేట‌స్‌లో ప్ర‌స్తుతం 30 సెక‌న్ల వీడియో పెట్టుకోవ‌చ్చు. దీన్ని రెట్టింపు చేసి, నిమిషం నిడివి గ‌ల వీడియోను స్టేట‌స్‌లో పెట్టుకోవ‌డానికి వీలుగా కొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది.

త్వ‌ర‌లోనే కొత్త ఫీచ‌ర్‌.. వాట్స‌ప్‌లో నిమిషంపాటు స్టేట‌స్ వీడియో
X

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫీచ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను అల‌రిస్తున్న వాట్స‌ప్ ఇప్పుడు మ‌రో కీల‌క అప్‌డేట్‌తో వ‌స్తోంది. వాట్స‌ప్‌లో సూప‌ర్ క్లిక్ అయిన స్టేట‌స్ ఫీచ‌ర్‌ను మ‌రింత డెవ‌ల‌ప్ చేస్తోంది. స్టేట‌స్‌లో ప్ర‌స్తుతం 30 సెక‌న్ల వీడియో పెట్టుకోవ‌చ్చు. దీన్ని రెట్టింపు చేసి, నిమిషం నిడివి గ‌ల వీడియోను స్టేట‌స్‌లో పెట్టుకోవ‌డానికి వీలుగా కొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది.

స్టేట‌స్ ఇంకా ఎఫెక్టివ్‌గా..

ఇప్పుడు 30 సెకన్ల వీడియో నుంచి నిమిషం వీడియో పెట్టుకుంటే ఎక్కువ వీడియోలు అప్‌లోడ్ చేయ‌క్క‌ర‌క‌లేదు. ఇప్పుడు రెండు నిమిషాల వీడియో పెట్టాలంటే దాన్ని నాలుగు పార్ట్‌లుగా అప్‌లోడ్ చేయాల్సి వ‌స్తోంది. అదే నిమిషం వీడియో ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే రెండు పార్ట్‌లుగా చేస్తేచాలు. అంతేకాదు చాలావీడియోలు 45, 50 సెకన్ల‌వే ఉంటాయి. అలాంటివి సింగిల్‌గా అప్‌డేట్ చేస్తే చాలు.

ప్ర‌స్తుతం వాట్స‌ప్ 2.24.7.3 వెర్ష‌న్‌కు అప్‌లోడ్ చేసుకున్న‌వారికే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి తేబోతున్నారు. బీటా వెర్ష‌న్ స‌క్సెస్ అయితే త్వ‌రలోనే వాట్స‌ప్ యూజ‌ర్లంద‌రికీ వ‌న్‌మినిట్ వీడియో స్టేట‌స్ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తుంది.

First Published:  20 March 2024 7:54 AM GMT
Next Story