Telugu Global
Science and Technology

ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్ షేరింగ్! వాట్సాప్‌లో కొత్త ఫీచర్!

ఇంటర్నెట్‌ కనెక్షన్ లేకపోయినా వాట్సా్ప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటివి షేర్‌ చేసే విధంగా ఈ నియర్‌‌బై షేరింగ్ ఫీచర్ పనిచేస్తుంది.

ఇంటర్నెట్ లేకుండా ఫైల్స్ షేరింగ్! వాట్సాప్‌లో కొత్త ఫీచర్!
X

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌.. గత కొంతకాలంగా ఇంట్రెస్టింగ్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. తాజాగా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫొటోలు వీడియోలు షేర్ చేసే విధంగా ఆఫ్‌లైన్ షేరింగ్ ఫీచర్‌‌ను ప్రవేశపెట్టనుంది. ఇదెలా పనిచేస్తుందంటే..

పేరుకి వాట్సాప్ మెసేజింగ్ యాప్ అయినా ఇందులో యూజర్లు బిజినెస్ యాక్టివిటీస్, ఫైల్స్ షేరింగ్, ప్రమోషన్స్.. ఇలా చాలా పనులకు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఫైల్స్ పంపేదుకు ప్రతీ ఒక్కరూ మొదటి ఛాయిస్‌గా వాట్సాప్‌నే ఎంచుకుంటారు. అందుకే ఈ ఫీచర్‌‌ను అప్‌డేట్ చేస్తూ వాట్సాప్ ఆఫ్‌లైన్ షేరింగ్ ఫెసిలిటీని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

ఇంటర్నెట్‌ కనెక్షన్ లేకపోయినా వాట్సా్ప్ ద్వారా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ వంటివి షేర్‌ చేసే విధంగా ఈ నియర్‌‌బై షేరింగ్ ఫీచర్ పనిచేస్తుంది. దీనికోసం రెండు మొబైళ్లు ఒకేచోట దగ్గరగా ఉండాలి. మొబైల్ సెట్టింగ్స్‌లో వాట్సాప్‌కు ఫోల్డర్స్‌, ఫైల్స్ యాక్సెస్ ఇచ్చి, ఫోన్‌లో బ్లూటూత్ కనెక్షన్ ఆన్‌లో ఉంచడం ద్వారా ఈ ఫీచర్ పని చేస్తుంది. ఈ ఫీచర్ సాయంతో మరింత వేగంగా, సురక్షితంగా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు.

వాట్సప్‌ ద్వారా ఫైల్స్ షేరింగ్‌ను సులభతరం చేయడం కోసం ఈ ఫీచర్‌ని తీసుకొస్తున్నట్టు వాట్సాప్ చెప్తోంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం ఈ ఫీచర్‌ బీటా టెస్టింగ్‌ దశలో ఉంది. త్వరలోనే అందరి యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

ఇకపోతే తాజాగా వాట్సాప్ ఏఐ చాట్ బాక్స్ ఫీచర్ గురించి అనౌన్స్ చేసింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే వాట్సాప్ చాట్‌ లిస్ట్‌లో ఫేవరెట్స్‌ అనే ఆప్షన్‌ను తీసుకురావడంపై కూడా మెటా సంస్థ పనిచేస్తోంది.

First Published:  29 April 2024 4:15 AM GMT
Next Story