Telugu Global
Science and Technology

క్యాప్షన్ ఫార్వార్డ్, డీపీ బ్లర్.. వాట్సాప్ లో కొత్త అప్ డేట్స్!

వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు వేరొకరికి ఫార్వర్డ్‌ చేసేటప్పుడు ఆ ఫొటో లేదా వీడియోతో పాటు టెక్స్ట్‌ కూడా వస్తే.. దానిని ఫార్వర్డ్‌ చేయడం కుదిరేది కాదు. ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తే కేవలం ఇమేజ్‌/వీడియో మాత్రమే వెళ్తుంది.

క్యాప్షన్ ఫార్వార్డ్, డీపీ బ్లర్..  వాట్సాప్ లో కొత్త అప్ డేట్స్!
X

వాట్సాప్‌లో ఉండే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్‌కి చెక్ పెడుతూ మెటా కొన్ని కొత్త అప్‌డేట్స్ తీసుకొస్తోంది. ఫోటో, వీడియో ఫార్వార్డ్, డీపీ బ్లర్ లాంటి కొత్త అప్‌డేట్స్ ద్వారా ఏయే మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు వేరొకరికి ఫార్వర్డ్‌ చేసేటప్పుడు ఆ ఫొటో లేదా వీడియోతో పాటు టెక్స్ట్‌ కూడా వస్తే.. దానిని ఫార్వర్డ్‌ చేయడం కుదిరేది కాదు. ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తే కేవలం ఇమేజ్‌/వీడియో మాత్రమే వెళ్తుంది. దీంతో మళ్లీ ఆ టెక్స్ట్‌ను సెపరేట్‌గా టైప్‌ చేయాలి. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ వాట్సాప్‌ త్వరలో అప్‌డేట్ తీసుకురానుంది. క్యాప్షన్ కూడా ఫార్వార్డ్ అయ్యేలా ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చారు.

ఇకపోతే వాట్సాప్‌లో ఫొటోలను పంపేముందు వాటిని బ్లర్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా త్వరలో రాబోతుంది. అలాగే మీ ఇమేజ్‌లో కొంత భాగాన్ని ఎడిట్ చేసి బ్లర్ చేయొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ఇమేజ్ ఎడిటింగ్ ఆప్షన్‌లో చిన్న బ్లర్ టూల్ అందుబాటులో ఉంటుంది. ఆ టూల్‌తో ఇమేజ్‌లో ఎంచుకున్న భాగాలను బ్లర్ చేయొచ్చు.

వాట్సాప్‌లో మరికొన్ని డిజైన్‌ మార్పులు కూడా రాబోతున్నాయి. గ్రూపుల్లో మెసేజ్‌ చేసినప్పుడు వాళ్ల పేరు, నెంబరు మాత్రమే కనిపిస్తుంది. త్వరలో వాళ్ల డీపీ కూడా కనిపిస్తుందట. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లు టెస్టింగ్‌ దశలో ఉన్నాయి. త్వరలో యూజర్లకు అందుబాటులోకి రావొచ్చు.

First Published:  31 Oct 2022 8:07 AM GMT
Next Story