Telugu Global
Science and Technology

రింగ్ టోన్లు, హెచ్‌డీ ఫొటోలు..వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

వాట్సాప్‌లో ఉండే రకరకాల కాంటాక్ట్స్‌కు రకరకాల రింగ్ టోన్లు పెట్టుకునే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

whatsapp ringtones
X

రింగ్ టోన్లు, హెచ్‌డీ ఫొటోలు..వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు! 

యూజర్ల అవసరాలకు తగినట్టుగా కొత్త కొత్త అప్‌డేట్స్‌ తీసుకొచ్చే వాట్సాప్.. ఈ సారి కస్టమ్ రింగ్ టోన్స్ అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఇదెలా ఉంటుందంటే..


వాట్సాప్‌లో ఉండే రకరకాల కాంటాక్ట్స్‌కు రకరకాల రింగ్ టోన్లు పెట్టుకునే విధంగా వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌‌ సాయంతో ఒక్కో కంటాక్ట్‌కు ఒక్కో రింగ్ టోన్ సెలక్ట్ చేసుకోవచ్చు.

దీనివల్ల రింగ్ టోన్‌ను బట్టి ‘మెసేజ్ వచ్చింది ఎవరి నుంచి’ అనే విషయం తెలిసిపోతుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం కోసం.. ‘కన్వర్జేషన్‌’ ట్యాబ్‌ సెలక్ట్‌ చేసి, కాంటాక్ట్‌ను సెలెక్ట్‌ చేసుకున్న కాంటాక్ట్ ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాలి.

కింద ‘కస్టమ్‌ నోటిఫికేషన్‌’ అని ఉంటుంది. అది సెలెక్ట్‌ చేసుకుని ‘యూజ్ కస్టమ్‌ నోటిఫికేషన్‌’ ఆన్ చేయాలి. తర్వాత రింగ్‌టోన్‌పై ట్యాప్‌ చేసి ఇష్టమైన రింగ్‌టోన్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి.


ఇకపోతే వాట్సాప్‌లో ఫొటోలు పంపినప్పుడు క్వాలిటీ తగ్గిపోవడం మామూలే. ఈ సమస్యకు చెక్ పెడుతూ ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు పంపుకునేలా వాట్సాప్ మ‌రో లేటెస్ట్ ఫీచ‌ర్‌పై పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్‌‌లో భాగంగా ఫొటోను పంపేముందు క్వాలిటీని మార్చుకునేందుకు ఇమేజ్ ప్రివ్యూ సెక్షన్‌ను కూడా జోడించ‌నుంది వాట్సాప్.

వీటితో పాటు యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్ పై కూడా పనిచేస్తోంది వాట్సాప్. యూజర్లు తమకు నచ్చిన భాషలో మెసేజ్‌లను అర్థం చేసుకునేందుకు వీలుగా ఇంటర్నల్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి.. మెసేజ్‌పై క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే.. మోర్ ఆప్షన్స్‌లో ఈ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ కనిపిస్తుందట.

First Published:  24 Jan 2023 12:43 PM GMT
Next Story