Telugu Global
Science and Technology

ఈ ఏడాది బెస్ట్ వాట్సాప్ ఫీచర్లు ఇవే..

WhatsApp best features in 2022: మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. వాట్సాప్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ వందల సంఖ్యలో కొద్దీ ఫీచర్లు యాడ్ అయ్యాయి. అయితే ఏడాది ముగుస్తున్న సందర్భంగా 2022లో ప్రవేశపెట్టిన బెస్ట్ వాట్సాప్ ఫీచర్లు, బెస్ట్ టిప్స్ కొన్ని గుర్తుచేసుకుందాం.

WhatsApp new features
X

వాట్సాప్ ఫీచర్లు

మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. వాట్సాప్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ వందల సంఖ్యలో కొద్దీ ఫీచర్లు యాడ్ అయ్యాయి. అయితే ఏడాది ముగుస్తున్న సందర్భంగా 2022లో ప్రవేశపెట్టిన బెస్ట్ వాట్సాప్ ఫీచర్లు, బెస్ట్ టిప్స్ కొన్ని గుర్తుచేసుకుందాం.

ఈ ఏడాది వచ్చిన బెస్ట్ అప్‌డేట్స్‌లో 'లాస్ట్ సీన్ అండ్ ఆన్‌లైన్' ప్రైవసీ సెట్టింగ్స్ ముందుంటాయి. ఆన్‌లైన్‌లో ఉన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేస్తే మీ ఆన్‌లైన్ స్టేటస్ ఇతరుకు కనిపించదు. అలాగే మీరు కూడా ఇతర యూజర్ల ఆన్‌లైన్ స్టేటస్ చూడలేరు.

వాట్సాప్‌లో అనుకోకుండా డిలీట్ చేసిన మెసేజ్‌లను 'అన్‌డు' చేసే ఫీచర్ కూడా ఈ ఏడాదే వచ్చింది. పొరపాటున మెసేజ్‌ని డిలీట్ చేస్తే.. ఐదు సెకన్ల లోపు 'అన్‌డు' విండో కనిపిస్తుంది.

వాయిస్ మెసేజ్ -రికార్డ్ చేసేటప్పుడు మధ్యలో కట్ అవ్వకుండా లాంగ్ ప్రెస్ అండ్ లాక్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది వాట్సాప్ . మైక్ ఐకాన్‌ పై లాంగ్ ప్రెస్ చేస్తూ లాక్ చేస్తే ఎంతసేపైనా రికార్డ్ అవుతుంది. అలాగే రెడ్ కలర్ మైక్ ఐకాన్ ఉపయోగించి మధ్యలో పాజ్ చేయొచ్చు. తర్వాత మళ్లీ తిరిగి రికార్డ్ చేయొచ్చు.

వాట్సాప్ యూజర్లు గ్రూపులలో మెంబర్‌గా ఉండకూడదనుకుంటే గ్రూప్‌ నుంచి ఎవరికీ తెలియకుండా ఎగ్జిట్ అవ్వొచ్చు. ఒకప్పుడు గ్రూప్‌ నుంచి ఎగ్జిట్‌ అయితే ఆ విషయం అందరికీ తెలిసేది. ఇప్పుడా సమస్య లేదు. అలాగే 'వాట్సాప్ కమ్యూనిటీస్' అనే కొత్త ఫీచర్ కూడా ఇదే ఏడాది వచ్చిది.

వాట్సాప్‌ను నోట్‌ప్యాడ్‌గా వాడుకునేందుకు, ముఖ్యమైన డాక్యుమెంట్లు సేవ్ చేసుకునేందుకు 'మెసేజ యువర్ సెల్ఫ్' ఫీచర్ కూడా ఇదే సంవత్సరం అందుబాటులోకి వచ్చింది.

ఏ ఏడాది వచ్చిన మరో మంచి ఫీచర్.. యాప్‌లోని నిర్దిష్ట యూజర్ల నుంచి ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేయగలగడం.

వాట్సాప్‌ వీడియో కాల్స్‌లో గరిష్టంగా 32 మంది యూజర్లను యాడ్‌ చేసుకునే సదుపాయం కూడా ఇదే ఏడాది అందుబాటులోకి వచ్చింది. వీటితోపాటు ఇన్-చాట్ పోల్స్, వ్యూ వన్స్ మెసేజ్ లాంటి ఫీచర్లు కూడా ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఫీచర్లుగా చెప్పుకోవ్చచ్చు.

First Published:  23 Dec 2022 11:43 AM GMT
Next Story