Telugu Global
Science and Technology

వాట్సాప్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్స్

వాట్సాప్ తీసుకొచ్చిన లేటెస్ట్ అప్ డేట్స్‌లో గ్రూప్స్ నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ అవ్వడం, ఆన్ లైన్ స్టేటస్ కస్టమైజేషన్స్, వ్యూ వన్స్ మెసేజ్ లాంటి సరికొత్త ఫీచర్లున్నాయి.

WhatsApp new features
X

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. యూజర్ల కోసం సరికొత్త సేఫ్టీ ఫీచర్స్ తీసుకొచ్చింది. యూజర్స్ ఎప్పటినుంచో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేస్తూ సేఫ్టీ ఫీచర్స్‌ను అప్‌డేట్ చేసింది. ఇంతకీ ఆ ఫీచర్లేంటంటే..

వాట్సాప్ తీసుకొచ్చిన లేటెస్ట్ అప్ డేట్స్‌లో గ్రూప్స్ నుంచి సైలెంట్‌గా లెఫ్ట్ అవ్వడం, ఆన్ లైన్ స్టేటస్ కస్టమైజేషన్స్, వ్యూ వన్స్ మెసేజ్ లాంటి సరికొత్త ఫీచర్లున్నాయి. "లీవ్ గ్రూప్స్ సైలెంట్లీ " అనే ఫీచర్ ద్వారా వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులు గ్రూప్ నుంచి ఎవరికి తెలియకుండా నిష్క్రమించవచ్చు. గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన విషయం గ్రూప్ అడ్మిన్లకు తప్ప ఇంకెవరికీ తెలీదు.

ఆన్‌లైన్ స్టేటస్

వాట్సాప్‌లో లాస్ట్ సీన్‌ను కనిపించకుండా చేసే వీలుంది. కానీ ఆన్‌లైన్‌లో ఉన్న విషయాన్ని దాచే ఫీచర్ లేదు. చాలామంది వాట్సాప్ యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను ప్రైవేట్‌గా ఉంచుకోవాలనుకుంటారు. ఆన్‌లైన్‌లో ఉన్నట్టు అందరికీ తెలియడం ద్వారా ఎవరో ఒకరు మెసేజ్ చేసే అవకాశముంటుంది. పనిలో ఉండి రిప్లై ఇవ్వకపోతే ఆన్‌లైన్‌లో ఉండి కూడా రిప్లై ఇవ్వలేదని తప్పుగా భావించే వీలుంది. అందుకే ఆన్‌లైన్ స్టేటస్‌ను ప్రైవేట్‌గా ఉంచే ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉన్నట్టు ఎవరికి కనిపించాలో యూజర్లే ఎంపిక చేసుకోవచ్చు.

వ్యూ వన్స్

సెండ్ చేసిన ఫొటో, వీడియోను అవతలి వాళ్లు ఒకేసారి మాత్రమే చూసేలా ఇటీవల ఓ ఆప్షన్ తీసుకొచ్చింది వాట్సాప్. అయితే అలా పంపిన ఫోటోలను చాలామంది వెంటనే స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేస్తుంటారు. దీనికి చెక్ పెడుతూ వాట్సా్ప్ ఫీచర్‌‌ను అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేట్‌తో అవతలి వాళ్లు స్క్రీన్ షాట్ తీసుకునే వీలుండదు.

డిలీట్ ఫర్ ఎవ్రీవన్

ఇకపోతే గతంలో మెసేజ్‌లను పూర్తిగా డిలీట్ చేసేందుకు 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' ఫీచర్ ఉండేది. అయితే మెసేజ్ పంపిన కొంతసమయం వరకు మాత్రమే ఆ ఆప్షన్ పనిచేస్తుంది. ఇప్పుడా టైం లిమిట్‌ను అప్‌డేట్ చేసింది వాట్సాప్. మెసేజ్ పంపిన 2 రోజుల 12 గంటల వరకు దాన్ని పర్మినెంట్‌గా డిలీట్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.

First Published:  10 Aug 2022 12:30 AM GMT
Next Story