Telugu Global
Science and Technology

ఫ్రాడ్ కాల్స్ రిపోర్ట్ చేసేందుకు ‘చక్షు’ పోర్టల్! ఎలా పనిచేస్తుందంటే..

‘చక్షు’ అంటే కన్ను అని అర్థం. మొబైల యూజర్లు తమకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ గురించి, అనుమానిత నెంబర్ల గురించి, ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల గురించి కూడా ఇందులో రిపోర్ట్ చేయొచ్చు.

ఫ్రాడ్ కాల్స్ రిపోర్ట్ చేసేందుకు ‘చక్షు’ పోర్టల్! ఎలా పనిచేస్తుందంటే..
X

సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో టెలీ కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ ఓ సరికొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ఫ్రాడ్ కాల్స్ బారిన పడిన బాధితులు తేలికగా ఫ్రాడ్స్‌ను రిపోర్ట్ చేసేవిధంగా ఈ పోర్టల్ ఉండనుంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ‘మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్’ విభాగం ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్​ఫాం(డీఐపీ)’, ‘చక్షు’ అనే పోర్టల్స్‌ను అందుబాటులో ఉంచింది. ఇందులో ‘డీఐపీ’ అనేది యూపీఐ పేమెంట్ యాప్స్, టెలికాం సర్వీస్​ ప్రొవైడర్లు రియల్ టైం ఇంటెలిజెన్స్‌ను షేర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే ‘చక్షు’ అనేది బాధితులు ఫ్రాడ్స్‌ను రిపోర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది.

చక్షు’ అంటే కన్ను అని అర్థం. మొబైల యూజర్లు తమకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ గురించి, అనుమానిత నెంబర్ల గురించి, ఫ్రాడ్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల గురించి కూడా ఇందులో రిపోర్ట్ చేయొచ్చు. ఈ పోర్టల్‌లో కంప్లెయింట్ చేసిన వెంటనే తగిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. నేరగాళ్లు దొరికితే మీ డబ్బు వాపస్ అయ్యేలా సాయం చేస్తారు. అలాగే కొన్నిసార్లు హ్యాకింగ్ గురయ్యి బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ అవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా ‘చక్షు’ పోర్టల్ సాయంతో అకౌంట్‌ను రికవరీ చేసుకోవచ్చు.

చక్షు పోర్టల్‌లో రిపోర్ట్ చేయడం కోసం ‘చక్షు’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ‘సంచార్ సాథి పోర్టల్(sancharsaathi.gov.in)’ లో ‘చక్షు’ పేజీ మీద క్లిక్ చేసి కూడా కంప్లెయింట్ చేయొచ్చు.

First Published:  7 March 2024 1:45 AM GMT
Next Story