Telugu Global
Science and Technology

భయపెడుతున్న డీప్ ఫేక్ టెక్నాలజీ.. గుర్తించడమెలాగంటే..

హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో డీప్ ఫేక్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తించాలి?

భయపెడుతున్న డీప్ ఫేక్ టెక్నాలజీ.. గుర్తించడమెలాగంటే..
X

భయపెడుతున్న డీప్ ఫేక్ టెక్నాలజీ.. గుర్తించడమెలాగంటే..

హీరోయిన్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో డీప్ ఫేక్ టెక్నాలజీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తించాలి?

డీప్‌నెక్‌ డ్రెస్‌ వేసుకున్న జరా పటేల్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫ్ చేసిన ఫేక్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై బాధపడుతున్నట్టుగా రష్మిక ఎక్స్(ట్రిటర్)లో పోస్ట్ చేసింది. “ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఈ విషయం చెప్పాల్సి రావడం బాధాకరం. టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది, ఎక్కువమంది వీటి బారిన పడకముందే ఈ సమస్యను పరిష్కరించాలి” అంటూ పెద్ద పోస్ట్ రాసుకొచ్చింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖతోపాటు అమితాబ్ బచ్చన్, నాగచైతన్య, కల్వకుంట్ల కవిత వంటి పలువురు స్పందించారు. దాంతో డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

డీప్‌ ఫేక్‌ మాయ

డీప్‌ ఫేక్‌ అనేది ఏఐ టెక్నాలజీలో భాగం. సినిమాలు, ఎంటర్‌‌టైన్‌మెంట్ విభాగాల్లో క్రియేటివ్‌ వీడియోల కోసం ఇది ఉపయోగపడుతుంది. అసాధ్యం కాని కొన్ని విషయాలను ఈ టెక్నాలజీతో సుసాధ్యం చేయొచ్చు. వయసు వారీగా ముఖాన్ని రీక్రియేట్ చేయడం, చనిపోయిన నటీనటులను మోడ్రన్ లుక్‌లో తెరపై చూపించడం వంటివి ఈ టెక్నాలజీతో చేయొచ్చు. అయితే వీటిని ఇలా మార్ఫింగ్ కోసం వాడడం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది. సైబర్ నేరగాళ్లు దీన్ని ఉపయోగించుకుని పలురకాల ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్టుగా ప్రముఖుల వీడియోలు, రాజకీయనాయకులు ఇతరులపై కామెంట్స్ చేస్తున్నట్టు రకకరాల ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు.

ఇలా గుర్తించొచ్చు

డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది అచ్చు గుద్దినట్టుగా మార్ఫింగ్ చేయలేదు. కేవలం ఎంటర్‌‌టైన్‌మెంట్ కోసం బాగుంటుంది. కానీ, నిజాన్ని పూర్తిగా దాయలేదు. కాస్త నిశితంగా పరిశీలిస్తే డీప్ ఫేక్ వీడియోలను ఈజీగా గుర్తుపట్టొచ్చు.

డీప్ ఫేక్ వీడియోల్లో ముఖ కవళికలు కాస్త అసాధారణంగా ఉంటాయి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ బాగా బ్లర్ అయినట్టు కనిపిస్తుంది.

డీప్ ఫేక్ ద్వారా సృష్టించిన వీడియోల్లోని వ్యక్తుల కళ్లు నేచురల్‌గా ఉండవు. కనురెప్పల కదలికలు మరీ వేగంగా లేదా నెమ్మదిగా ఉంటాయి. కంటి కదలికలను బట్టి మార్ఫింగ్ వీడియోలను ఈజీగా గుర్తించొచ్చు.

ఇలాంటి వీడియోల్లో బుగ్గలు, నుదురు వంటివి స్మూత్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. అలాగే కళ్లద్దాల్లో కనిపించే లైట్ గ్లేర్స్‌ను గమనిస్తే.. అవి కృత్రిమంగా సృష్టించినవని తెలిసిపోతుంది.

ఫేక్ వీడియోల్లోని వ్యక్తుల మాట్లాడేటప్పుడు నోటి కదలికలు సహజంగా ఉండవు. లిప్ సింక్ మిస్ అవుతుంది.

ఇకవీటితోపాటు సెంటినెల్(thesentinel.ai), వి వెరిఫై (weverify.eu), ‘మైక్రోసాఫ్ట్ వీడియో అథెంటికేటర్ టూల్’, ‘ఇంటెల్ రియల్ టైం డీప్ ఫేక్ డిటెక్టర్’ వంటి టూల్స్ సాయంతో ఫేక్ వీడియోలను తెలుసుకోవచ్చు.

First Published:  7 Nov 2023 12:15 PM GMT
Next Story