Telugu Global
Science and Technology

గేమ్స్ ఆడేటప్పుడు యాడ్స్ రాకూడదంటే..

గేమ్స్ ఆడేప్పుడు యూజర్లను ఎక్కువగా వేధించే సమస్య యాడ్స్. చాలారకాల ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యాడ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అయితే గేమింగ్ మధ్యలో వచ్చే ఈ యాడ్స్‌ని తప్పించుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి.

గేమ్స్ ఆడేటప్పుడు యాడ్స్ రాకూడదంటే..
X

గేమ్స్ ఆడేటప్పుడు యాడ్స్ రాకూడదంటే..

గేమ్స్ ఆడేప్పుడు యూజర్లను ఎక్కువగా వేధించే సమస్య యాడ్స్. చాలారకాల ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యాడ్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అయితే గేమింగ్ మధ్యలో వచ్చే ఈ యాడ్స్‌ని తప్పించుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటంటే..

గేమ్స్ ఆడేప్పుడు యాడ్స్ రావడానికి ఇంటర్నెట్‌ కూడా ఒక కారణం. అందుకే ఆఫ్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు ఇంటర్నెట్ ఆపేస్తే యాడ్స్ కనిపించవు. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కువగా బ్యానర్ యాడ్స్, వీడియో యాడ్స్ డిస్టర్బ్ చేస్తుంటాయి. అందుకే మొబైల్ డేటా, వైఫై కనెక్షన్స్ టర్న్ ఆఫ్ చేసి గేమ్స్ ఆడటం బెటర్.

కొన్ని వీడియో గేమ్స్ ఆడాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. అలాంటి గేమ్స్‌లో వచ్చే యాడ్స్‌ని తప్పించుకోవడం కష్టమే. యాడ్స్ మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయంటే ప్రీమియం వర్షన్ తీసుకోవాల్సిందే.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లలో మీ యాక్టివిటీ ఆధారంగా యాడ్‌లను ఇచ్చేందుకు ‘పర్సనలైజ్‌ యాడ్స్‌’ అనే ఫీచర్‌ ఉంటుంది. దాన్ని డిసేబుల్ చేస్తే మీ యాక్టివిటీస్‌ని యాడ్ కంపెనీ వాళ్లు ట్రాక్‌ చేయలేరు. అలా యాడ్స్ తగ్గుతాయి.

దీనికోసం ఆండ్రాయిడ్‌ యూజర్లు సెట్టింగ్స్‌లో, అడిషనల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్స్‌లో యాడ్ సర్వీసెస్‌పై క్లిక్‌ చేసి, పర్సనలైజ్‌ యాడ్ రికమండేషన్స్‌ని డిజేబుల్ చేయాలి.

First Published:  20 May 2023 1:42 PM GMT
Next Story