Telugu Global
Science and Technology

Vivo Y200 | ఆ మూడు ఫోన్ల‌తో వివో వై200 ఫోన్ టఫ్ ఫైట్‌.. ధ‌ర‌ రూ.22 వేల లోపే.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!

Vivo Y200 | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) భార‌త్ మార్కెట్లో త‌న వివో వై200 (Vivo Y200) ఫోన్ ఆవిష్క‌రించింది.

Vivo Y200 | ఆ మూడు ఫోన్ల‌తో వివో వై200 ఫోన్ టఫ్ ఫైట్‌.. ధ‌ర‌ రూ.22 వేల లోపే.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..!
X

Vivo Y200 | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ వివో (Vivo) భార‌త్ మార్కెట్లో త‌న వివో వై200 (Vivo Y200) ఫోన్ ఆవిష్క‌రించింది. వివో వై200 (Vivo Y200) ఫోన్ స్నాప్ డ్రాగ‌న్ 4 జెన్ 1 ఎస్వోసీ (Snapdragon 4 Gen 1 SoC) చిప్ విత్ 8 జీబీ ర్యామ్‌తో వ‌చ్చింది. వ‌ర్చువ‌ల్‌గా ర్యామ్ కెపాసిటీ పెంచుకోవ‌చ్చు. డేటా స్టోరేజీ కెపాసిటీ పెంచుకునే అవ‌కాశం ఉంటుంది. వివో వై200 (Vivo Y200) ఫోన్ రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే (AMOLED Display)తో వ‌చ్చింది. వివో వై 200 (Vivo Y200) ఫోన్ 64-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్‌తో కూడిన డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంట‌ది. 44వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 4,800 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తుంది. ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ మార్కెట్‌లో ఆవిష్క‌రించిన వివో వై100 కొన‌సాగింపుగా వ‌స్తున్న వివో వై200 (Vivo Y200) ఫోన్.. భార‌త్ మార్కెట్లో వ‌న్ ప్ల‌స్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) శాంసంగ్ గెలాక్సీ ఎం34 (Samsung Galaxy M34), రెడ్‌మీ నోట్12 5జీ(Redmi Note 12 5G) ఫోన్ల‌కు గ‌ట్టి పోటీనిస్తుంద‌ని భావిస్తున్నారు.

వివో వై200 (Vivo Y200) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ మోడ‌ల్ రూ.21,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ టాప్ హై ఎండ్ ఫోన్ రూ.24,999 ప‌లుకుతుంది. జంగిల్ గ్రీన్‌, డ‌స‌ర్ట్ గోల్డ్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. వివో ఇండియా ఈ-స్టోర్‌తోపాటు ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్ల‌లో ల‌భ్యం అవుతుంది.

ఎస్బీఐ, ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌, యెస్ బ్యాంక్ కార్డుల‌తో వివో వై200 ఫోన్ కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు అందిస్తోంది. 24 నెల‌ల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది. వివో త‌న వివో వై100 ఫోన్ రూ.23,999ల‌కు మార్కెట్లో ఆవిష్క‌రించినా.. ఇటీవ‌లే దాని ధ‌ర రూ.2000 త‌గ్గించేసింది.

వివో వై200 (Vivo Y200) ఫోన్ డ్యుయ‌ల్ సిమ్ (నానో) ఆప్ష‌న్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ 13 వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. వివో వై200 ఫోన్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్‌) అమోలెడ్ డిస్‌ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ క‌లిగి ఉంటుంది. ఈ ఫోన్ 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో వ‌స్తున్న‌ది. సెల్ఫీ కెమెరా కోసం సెంట్ర‌ల్లీ క‌ర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 6ఎన్ఎం స్నాప్ డ్రాగ‌న్ 4 జెన్ ఎస్వోసీ చిప్‌సెట్‌తో వ‌స్తుంది.

ఫోటోలు, వీడియోల కోసం వివో వై200 (Vivo Y200) ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంట‌ది. 64- మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ కెమెరా విత్ ఆప్టిక‌ల్ ఇమేజ్ స్టెబిలైజేష‌న్ (ఓఐఎస్‌) లెన్స్‌, 2- మెగా పిక్సెల్ సెకండ‌రీ సెన్స‌ర్ విత్ ఎఫ్‌/2.4 లెన్స్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీలూ, వీడియో చాట్ కోసం 16-మెగా పిక్సెల్స్ లెన్స్ కెమెరా విత్ ఎఫ్‌/2.0 అపెర్చ‌ర్ తో వ‌స్తుంది. నైట్ మోడ్‌, ప‌నోర‌మా, టైం ల్యాప్స్ వీడియో, డ్యుయ‌ల్ వ్యూ, పోర్ట్రైట్‌, స్లో మోష‌న్ త‌దిత‌ర మోడ్స్‌కు కెమెరా సెట‌ప్ మ‌ద్ద‌తుగా నిలుస్తుంది.

వివో వై200 (Vivo Y200) ఫోన్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్‌, గ్లోనాస్‌, గెలిలియో, క్యూజ‌డ్ఎస్ఎస్‌, యూఎస్బీ 2.0 సెన్స‌ర్లు, యాక్సెలెరో మీట‌ర్‌, అంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, మోటార్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్‌, ఈ-కంపాస్‌, గైరోస్కోప్ త‌దిత‌ర సెన్స‌ర్లు ఉంటాయి. అథంటికేష‌న్ కోసం ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్ ఉంటుంది.

First Published:  24 Oct 2023 10:29 AM GMT
Next Story